భారతదేశం మీద పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు కల్పించాలని ఆపరేషన్ సింధూర్ విజయవంత0 కావాలని, భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద మరియు త్రివిధ దళాలు,, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని , దేశానికి విజయం చేకూర్చాలని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో విజయ సంకల్ప పూజకు భారతదేశం పేరు మీద పూజలు నిర్వహించబడుచున్నవి. బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం లో, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు పూజ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్,మాజీ మండల అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం , సీనియర్…
Author: chilakaluripetalocalnews@gmail.com
దేవస్థానం చైర్మన్ గా భాస్కరరావు నియామకంచిలకలూరిపేట ::పట్టణంలోని మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా భాస్కర్ ఫ్యాన్సీ అధినేత గ్రంధి భాస్కరరావు గారు నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు
బాల్య వివాహాలతో మానసిక, శారీరక సమస్యలు– ఏసీడీపీవో నిర్మలారాణి– బోయపాలెం, ఉప్పరపాలెంలో అవగాహన సదస్సు యడ్లపాడు మండలంలోని బోయపాలెం, ఉప్పరపాలెం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ ఏసీడీపీవో నిర్మలా రాని ముఖ్య అతిథిగా హాజరై పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్యవివాహాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మతృ,శిశు మరణాలను తగ్గించేందుకు బాల్యవివాహాలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వలన బాలికల శారీరక, మానసిక పరిస్థితులపై దుప్రభావాన్ని చూపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ నిర్మలరాణి, సూపర్‌వైజర్ ఎం. జోజమ్మ, ఏఎన్‌ఎం ఏ. జోజి మేరీ, అంగన్వాడీ కార్యకర్తలు షేక్ జరీనా, వివి సుబ్బాయమ్మ, వి.ఆర్. కోటేశ్వరి, ఆశ వర్కర్లు షేక్ మస్తాన్‌బి తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణం 19వ వార్డు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరావతి సుభాని అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి నివాసం వద్ద ఉన్న వారి పార్దవదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని
ఈ నెల 12న చిలకలూరిపేట లో పెద్దరధం తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు. పెద్ద రథం తిరునాళ్ల కు ఈ ఏడాది అధిక సంఖ్య లో భక్తులు హాజర వుతారని అంచనా. కళామందిర్ సెంటర్ కొమరవల్లి పాడు లో వెంచేసి ఉన్నశ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగ గా జరుగనుంది. ఈ నెల 12వ తేది సోమవారం సాయంత్రం 6గంటలకు పెద్దరధం తిరునాళ్ల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవస్థానం లో స్వామి వారి కల్యాణమహోత్సవాలు జరుగుతున్నాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు భావన్నారాయణ నెత్రుత్వం లో ఈ తిరునాళ్ల మహోత్సవ పూజలు కొనసాగుతున్నాయి.
వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి ఘన నివాళి ప్రభుత్వ స్పందన పై కృతజ్ఞతలు:బి.శ్రీను నాయక్. భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన శుక్రవారం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి యస్. సవితా రూ.5 లక్షలు అందజేశారని పేర్కొన్నారు.వారికి గిరిజన సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వీరుడుగా వీరమరణం మురళి నాయక్ పొందారు. అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో సర్దార్ భగత్ సింగ్,…
మాజీమంత్రి, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి కార్యాలయం,చిలకలూరిపేట విడదల రజనీ బంధువులు మా స్థలం ఆక్రమించారు ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించనని, పరిష్కరించగలిగే సమస్యల్ని కూడా యంత్రాంగం పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన కూటమినేతలతో కలిసి ప్రజా వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించిన ప్రత్తిపాటి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. మాజీమంత్రి బంధువులు మా స్థలం ఆక్రమించారు.. పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలోని సాయిబాబా గుడివద్ద తమకున్న 10 సెంట్ల స్థలాన్ని విడదల రజనీ బంధువులు ఆక్రమించారని, సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ స్థల యజమానులు ప్రత్తిపాటిని ఆశ్రయించారు. సమస్య వివరాలు తెలుసుకున్న ప్రత్తిపాటి, బాధితులతో మాట్లాడి వారికి వెంటనే న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్…
పిడుగుపాటుతో మహిళ మృతి – ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పరామర్శ నరసరావుపేట మండలం నల్లగార్లపాడు పంచాయతీ పరిధిలోని పాలపాడు రోడ్డులో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గట్ల చిన్నమ్మ (వయస్సు 55) అనే మహిళ దుర్మరణం చెందారు. మృతురాలు భర్త పెద్ద అంకిరెడ్డి భార్య కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులకు సన్మానంపట్టణంలోని తెలుగు మీడియా ఫెడరేషన్.పి శివ. మనోహర్అధ్యక్షతనబీసీ ఆఫీస్ నందు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛ పరిరక్షణ దివస్ లో భాగంగా యువ విలేకరులని ఘనంగా సన్మానించడం జరిగింది మొదటిగా ఇమ్మడి సురేంద్ర బిఆర్కె న్యూస్ మాట్లాడుతూ జర్నలిస్టులను స్వేచ్ఛగా వారి విధులను చేసుకోవాలని తెలియపరిచారు మరియు అమరావతి విలేకరి మనోహర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వైద్య పరమైన సౌకర్యాలు గృహాలను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించారు అల్లడి హరిబాబు మాట్లాడుతూ మీడియాను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుభాని . బాలు. బొబ్బబెల్లివెంకటనారాయణ. షబ్బీర్ . వీరయ్య . దేవరకొండ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
అవమానభారంతో రైతులకు ముఖం చూపించలేకే .. రాజధాని సభకు జగన్ ముఖం చాటేశాడు : మాజీమంత్రి ప్రత్తిపాటి- అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించారు.. నేడు ప్రజల కళ్లలోని సంతోషం చూడలేకే రాజధాని వేడుకకు దూరమయ్యారు.: ప్రత్తిపాటి.- నిత్యకల్యాణంలా జరిగే అమరావతి పనుల్ని చూస్తూ, వేధించిన రైతుల ఎదుటే తన రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి : ప్రత్తిపాటి“ అమరావతి పున: నిర్మాణ ఘట్టాన్ని యావత్ భారతావని ఉత్సుకతతో తిలకించింది. 5 కోట్ల ఆంధ్రుల కళ్లు చెదిరిపోయేలా, అమరావతిపై అకారణంగా అక్కసువెళ్లగక్కిన వారు కళ్లలో నిప్పులు పోసుకునేలా రాజధాని సభ నభూతో అన్నట్టుగా భారీస్థాయిలో విజయవంతమైంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, రాజధానికి అండగా ఉంటానన్న ఆయన భరోసా తెలుగుజాతిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మతృప్తిని నింపాయి. ప్రధాని ప్రసంగంపై ప్రజల్లో హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండటమే దానికి నిదర్శనం. దైవానుగ్రహంతో అన్నీ అనుకూలించి, సకాలంలో అమరావతి నిర్మాణం పూర్తై, ఆ మహానగరం తమ…