నా విజయం నరసరావుపేట ప్రజలకు నాయకులకి కార్యకర్తలకి అంకితం*డాక్టర్ చదలవాడ
ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమాభివృద్ధి కొనసాగుతుంది.
శాసనసభ్యులు డాక్టర్. చదలవాడ అరవిందబాబు.
విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు, శ్రేణులు.
నరసరావుపేట:వైయస్సార్సీపి విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, కృషీవలుడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో ఆయన కార్యాలయము నుండి కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్స ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెదేపా, జనసేన, బిజెపి జెండాలు చేతబూని కూటమి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నిజాయితీ, ధైర్యం, సత్తాత్తో నియోజకవర్గంలో కూటమిని, కార్యకర్తలను, మహిళలను కాపాడుకుంటానాని… అభివృద్ధిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న వైఎస్సార్సీపీకి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆయన చాలెంజ్ చేశారు.
నియోజకవర్గంలో కూటమి అంటే అరవింద బాబు అని, అరవింద్ బాబు అంటే నిజాయితీ అని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిందని, త్వరలో ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా మహిళలకు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మాత్యులు లోకేష్ ల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఏడాది పాలనా విజయోత్సవ ర్యాలీ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ర్యాలీ అనంతరం శాసనసభ్యులు అరవిందబాబును కార్యకర్తలు తమ భుజాలపై ఎత్తుకొని ఎన్టీఆర్ విగ్రహం వరకు తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై చంద్రబాబు, జై అరవింద బాబు అంటూ ఆ ప్రాంగణమంతా నినాదాలతో హోరెత్తి పోయింది. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డిరవి, నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ, ఏఎంసి చైర్మన్ పూనాటి శ్రీనివాస్ రావు, రాష్ట్ర గ్రంధాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు , కూటమి అనుబంధ సంఘాల బాధ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలు శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు