Author: chilakaluripetalocalnews@gmail.com

ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన వైసీపీ సానుభూతిపరులైన 20 కుటుంబాలకు చెందిన వడ్డెరలు, చెంబేటి కుటుంబసభ్యులైన మరో 30 మంది బుధవారం ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్తిపాటిని ఆయన నివాసంలో కలిసిన వైసీపీ కార్యకర్తలు… ఆ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అధినేత జగన్ దిగజారుడు రాజకీయాలు, నేరస్వభావ మనస్తత్వాన్ని భరించలేకే తాము టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలిపారు. వారి కోరికను మన్మించిన ప్రత్తిపాటి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి చంబేటి వెంకటేశ్వర్లు, శ్రీను, పెద్ద వెంకటేశ్వర్లు, వేముల సుబ్బాయమ్మ, గుంజి పేరయ్య, వెంకటేశ్వర్లు, బత్తుల ఏసుదానమ్మ, మిగిలిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, టీడీపీ నాయకులు…

Read More

క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలను అర్హులైన యువత, స్వయం సహాయ సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారికి రుణాలు అందించని బ్యాంకులపై ప్రభుత్వ చర్యలుంటాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.17వ తేదీన నరసరావుపేటలో జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భారీసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. బుధవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణ క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులతో, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జులతో స్థానిక అమరావతి రెసిడెన్సీ నందు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుల నరసరావుపేట పర్యటన విజయవంతం.. జాతీయ ఓటర్ల సమగ్ర సర్వేపై (సర్) ప్రత్తిపాటి వారికి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్‌కు జనతా వారధి వినతిపత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి, రాష్ట్రంలో ఒకే ఆధార్ నంబర్‌కు పలు విద్యుత్ సేవా కనెక్షన్లు అనుసంధానం కావడంతో అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ సేవలకు దూరమవుతున్న సమస్యపై భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” తరపున వినతిపత్రం సమర్పించబడింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు మరియు జనతా వారధి కో-కన్వీనర్లు పాల్గొన్నారు. జనతా వారధి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల ప్రకారం, గతంలో జరిగిన పరిపాలనా నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాల వల్ల ఒకే ఆధార్ నంబర్‌కు పలువురు విద్యుత్ వినియోగదారుల సేవా కనెక్షన్లు అనుసంధానం కావడంతో వేలాది మంది ప్రజలు తీవ్ర…

Read More

భాష్యం ఎంపికతో కూటమి ప్రభుత్వం, ప్రజాభిప్రాయానికి విలువనిచ్చింది : ప్రత్తిపాటిరాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ కలిగిన భాష్యం విద్యాసంస్థల అధినేత, భాష్యం రామకృష్ణను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కూటమిప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.గురువారం ఆయన రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి చిలకలూరిపేటలోని షిర్డీ సాయినాథుని మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఇరువురూ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి, గురుపౌర్ణమి ప్రచార కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమాలు ముగిశాక ఎమ్మెల్యే, ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణ చేతల మనిషి : ప్రత్తిపాటిప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా టీడీపీ సముచిత నిర్ణయం తీసుకుందని, ఆయన రాకతో పార్టీకి ప్రత్యేక గుర్తింపు, బలం చేకూరుతాయని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రామకృష్ణ చేతల మనిషని, గతంలో తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ఆయనే…

Read More

పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ ‘సర్’ పై దుష్ప్రచారం చేస్తోంది‘సర్’ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నిష్ఫక్షపాతంగా జరుగుతోందని, ప్రజా ప్రభుత్వంలో జవాబుదారీ తనం ఉంటుందని, జగన్ ప్రభుత్వంలా దుర్మార్గాలకు పాల్పడదని ప్రత్తిపాటి చెప్పారు. ఎవరి ఓటును ఎవరూ తొలగించే అవకాశమే లేదని, అలా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ప్రత్తిపాటి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందన్నారు. ‘సర్’ పై కావాలనే వైసీపీ తమ సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ, ఆ పార్టీ అవినీతి మీడియా చేసే విషప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రత్తిపాటి కోరారు. ధూళిపాళ్ల.. సంగం టర్నోవర్ పెంచి లాభాల్ని రైతు కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తున్నారుపశుఫోషణతో రైతు కుటుంబాలకు…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ విషయం: రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా వినతి. భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, ప్రజల సామూహిక మరియు సామాజిక సమస్యలను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఒక భయంకరమైన, అత్యంత ఆందోళనకరమైన నిజం మా దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో ప్రతిరోజూ ప్రైవేట్ మరియు మున్సిపల్ సక్షన్ వాహనాల ద్వారా వేల లీటర్ల మానవ మలమూత్ర వ్యర్థాలు (Fecal Sludge) సేకరించబడుతున్నాయి. అయితే, ఈ వ్యర్థాలు చివరకు ఎక్కడికి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డిఆర్ఓ గారికి డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, మహిళా సాధికారత, SERP & MEPMA వ్యవస్థల పనితీరు, ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించడం, ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్ మరియు పారదర్శక డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం, రుణ మంజూరులో జరిగే డిడక్షన్లు, బీమాలు, ఛార్జీల వివరాలను లిఖితపూర్వకంగా అందించడం…

Read More

శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం విజయవంతం కేంద్ర, రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, శావల్యాపురం మండల అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వారపు జనతా వారధి కార్యక్రమం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను ఈ విధంగా తెలియజేశారు: ఈ సందర్భంగా వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం భారతీయ…

Read More

చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ చిలకలూరిపేట : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరిపేటలోని మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో గల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి…

Read More