పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి

  *కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్  దేశం గర్వించేలా అభివృద్ధి చెందుతుందని, అప్పుడే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు తెలిపారు. శ్రీ కృష్ణదేవరాయ విద్యాభివృద్ధి కమిటీ, ఆంధ్రప్రదేవ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జంపని కళ్యాణమండపం నందు నిర్వహించిన కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం, పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి మాట్లాడారు. కూటమిపార్టీల కలయిక రాష్ట్ర ప్రజలకు స్వేచ్చా సంతోషాలు తీసుకొచ్చిందన్న ప్రత్తిపాటి, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఐక్యతే మనందరి బలమని, ఆయనలానే మిగతా నాయకులు కూడా విశాలధృక్పథంతో ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు. గత ప్రభుత్వం ప్రజలు.. నాయకులతో పాటు, సామాజికవేత్తలు. స్వచ్ఛందసంస్థల నిర్వాహకుల్ని కూడా తీవ్రంగా ఇబ్బందిపెట్టిందని ప్రత్తిపాటి చెప్పారు. తమ వర్గాల్లోని పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తున్న శ్రీ కృష్ణదేవరాయ విద్యాభివృద్ధి కమిటీ, ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నిర్వాహకులు, సభ్యుల్ని ప్రత్యక్షంగా అభినందిస్తున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన 30మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు, నగదు పురస్కారాలు అందించి ఉన్నత చదువుల దిశగా వారిని ప్రోత్సహించడం మంచి నిర్ణయమని ప్రత్తిపాటి కొనియాడారు.*
         *ఈ కార్యక్రమంలో Gdms చైర్మన్ వడ్రణం హరిబాబు, తోట రాజారమేష్, మల్లెల శివ నాగేశ్వరావు పఠాన్ సమద్, మద్దుమాల రవి, తోట శరత్ చంద్ర, Ci రమేష్, మండలనేని చరణ్ తేజ, మాజీ మునిసిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫాని, షేక్ మస్తాన్ వలి, తోట బ్రహ్మస్వాములు, తోట సత్యం, మిరియాల లక్ష్మీ నారాయణ, ఇమ్మడి జానకిధర్, మిరియాల రత్న కుమారి, తదితరులు పాల్గొన్నారు...*
Share.
Leave A Reply