క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి

  • ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు.. పొదుపు మహిళల స్పష్టమైన ముద్ర కనిపించాలి : ప్రత్తిపాటి
  • బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జుల పనితీరు, నిబద్ధత సర్ కార్యాచరణలో స్పష్టంగా కనిపించాలి : ప్రత్తిపాటి
  • పొదుపు సంఘాల మహిళలు కొత్త రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకునే సరైన వేదిక క్రెడిట్ అవుట్ రీచ్ రుణ పంపిణీ కార్యక్రమం : ఎంపీ లావు.
  • 17న నరసరావుపేటలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన విజయవంతం.. సర్ కార్యాచరణపై నియోజకవర్గ క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలను అర్హులైన యువత, స్వయం సహాయ సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారికి రుణాలు అందించని బ్యాంకులపై ప్రభుత్వ చర్యలుంటాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
17వ తేదీన నరసరావుపేటలో జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భారీసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు.

బుధవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణ క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులతో, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జులతో స్థానిక అమరావతి రెసిడెన్సీ నందు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుల నరసరావుపేట పర్యటన విజయవంతం.. జాతీయ ఓటర్ల సమగ్ర సర్వేపై (సర్) ప్రత్తిపాటి వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. 17న నరసరావుపేటలో జరిగే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతంపై క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులకు పలు సూచనలు చేశారు. అనంతరం క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రత్తిపాటి, నరసరావుపేట సభా నిర్వహణ.. జనసమీకరణ.. ‘సర్’ నిర్వహణపై వారితో సమగ్రంగా చర్చించారు.

డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి..
నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులందరూ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ప్రత్తిపాటి క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులకు సూచించారు. పొదుపు సంఘాల సభ్యులు కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకునేలా వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు. డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, వారు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు అందిస్తున్నాయని ప్రత్తిపాటి చెప్పారు. సాధారణ పౌరులకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎం.ఎస్.బీ.వై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం.జే.జే.బీ.వై) వంటి పథకాలతో తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ప్రత్తిపాటి సూచించారు.

అర్హుల ఓటు.. ఒక్కటి కూడా పోవడానికి వీల్లేదు..
సర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులు సంపూర్ణ అవగాహనతో ఉండాలని, అర్హుల ఓటు ఒక్కటి పోయినా అది కూటమి పార్టీలకే నష్టమని ప్రత్తిపాటి సూచించారు. నమోదు కాని అర్హుల ఓట్లకు బూత్ కన్వీనర్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులే బాధ్యులవుతారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నమోదైన అక్రమ ఓట్ల తొలగింపుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సెప్టెంబర్ లోపే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ ముందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ప్రత్తిపాటి పార్టీ శ్రేణులకు సూచించారు.

పొదుపు సంఘాల మహిళలు, పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి : ఎంపీ లావు
ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని మహిళాసంఘాలు, పార్టీశ్రేణులు విజయవంతం చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పిలుపునిచ్చారు. బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ, ప్రతి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున పార్టీశ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు తరలిరావాలని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంపీ సూచించారు. పొదుపు సంఘాల మహిళలు కొత్త రుణాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ లావు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, ప్రధాన మద్దుమాల రవి, జాకోబు రాజు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, కోడె హనుమంతరావు, ఖుమీర్, కొత్త కోటేశ్వరరావు, బేరింగ్ మౌలాలి, గుంజి శ్రీనివాసరావు, ఇనగంటి జగదీష్, అమరా రమాదేవి, అంబటి సొంబాబు, షేక్ మస్తాన్ వలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply