పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటి
రైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- అధికారంలో సృష్టించిన దొంగఓట్లు పోతాయన్న భయంతోనే ‘సర్’ పై వైసీపీ దుష్ప్రచారం : ప్రత్తిపాటి
- కూటమి ప్రభుత్వం వైసీపీలా దుర్మార్గాలకు పాల్పడదు :ప్రత్తిపాటి
- రైతులు వ్యవసాయ నష్టాలను పశుపోషణతో అధిగమించాలి : ప్రత్తిపాటి
- కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ఓర్వలేకే స్వార్థ రాజకీయ నాయకుల దుష్ప్రచారం : ధూళిపాళ్ల
- తెలంగాణ, రాయలసీమలో త్వరలో సంగం కొత్త ప్లాంట్లు : ధూళిపాళ్ల
‘సర్’ (స్సెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై వైసీపీ, సాక్షి మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు అక్రమమార్గాల్లో సృష్టించిన దొంగఓట్లు పోతాయన్న భయంతోనే ఓటర్ల జాతీయ సమగ్ర సర్వేను తప్పుపడుతున్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆక్షేపించారు.
బుధవారం ఆయన సంగం డెయిరీ ఛైర్మన్, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి యడ్లపాడు మండలం జగ్గాపురంలో పర్య్టటించారు. గ్రామస్తులు, పశుపోషకుల ఆర్థిక పురోగతి కోసం నిర్మించిన సంగం డెయిరీ నూతన పాలకేంద్రాన్ని ప్రారంభించి, స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి వారు మాట్లాడారు.
తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ ‘సర్’ పై దుష్ప్రచారం చేస్తోంది
‘సర్’ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నిష్ఫక్షపాతంగా జరుగుతోందని, ప్రజా ప్రభుత్వంలో జవాబుదారీ తనం ఉంటుందని, జగన్ ప్రభుత్వంలా దుర్మార్గాలకు పాల్పడదని ప్రత్తిపాటి చెప్పారు. ఎవరి ఓటును ఎవరూ తొలగించే అవకాశమే లేదని, అలా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ప్రత్తిపాటి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు తాము సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందన్నారు. ‘సర్’ పై కావాలనే వైసీపీ తమ సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ, ఆ పార్టీ అవినీతి మీడియా చేసే విషప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రత్తిపాటి కోరారు.
ధూళిపాళ్ల.. సంగం టర్నోవర్ పెంచి లాభాల్ని రైతు కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తున్నారు
పశుఫోషణతో రైతు కుటుంబాలకు అదనపు ఆధాయం లభిస్తుందని, వ్యవసాయంలో వచ్చే నష్టాలను కొంత వరకు అధిగమించవచ్చని ప్రత్తిపాటి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలతో రైతులు పశుపోషణతో పాటు, గొర్రెలు, కోళ్ల పెంపకం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. సంగం డెయిరీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ధూళిపాళ్ల నరేంద్రకే దక్కుతుందని, సంస్థ టర్నోవర్ ను రూ.2 వేలకోట్లకు పెంచారని ప్రత్తిపాటి తెలిపారు. బహిరంగ మార్కెట్లో సంగం డెయిరీ పాల ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ కల్పించారన్నారు. సంస్థ లాభాల్ని రైతు కుటుంబాల సంక్షేమానికి వినియోగిస్తున్నారని, పాడి రైతులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ఓర్వలేకే దుష్ప్రచారం : ధూళిపాళ్ల నరేంద్ర (సంగం డెయిరీ ఛైర్మన్, శాసనసభ్యులు)
గత ప్రభుత్వంలో కక్షలు, కార్పణ్యాలు, అవినీతి, దుర్మార్గపు రాజకీయాలకు ప్రజలు బలైపోయారని, అభివృద్ధికి దూరమయ్యారని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధికోసం శ్రమిస్తుంటే, అది ఓర్వలేని కొందరు స్వార్థ రాజకీయ నాయకులు నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని నరేంద్ర అసహనం వ్యక్తంచేశారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే సంగండెయిరీని ఏర్పాటు చేయడం జరిగిందని, సంస్థ లాభాల్లో కొంత భాగాన్ని రైతుకుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి వెచ్చిస్తున్నామని సంగం డెయిరీ ఛైర్మన్, శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సంగం డెయిరీ వ్యవస్థను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చి, రాబోయే తరాలకు కూడా మరిన్ని సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. త్వరలోనే రాయలసీమ, తెలంగాణలో డెయిరీ తరుపున కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ధూళిపాళ్ల చెప్పారు. జగ్గాపురం గ్రామపెద్దలు, గ్రామస్థుల సహకారం, ఐక్యత వల్లే స్థానిక పాల ఉత్పత్తిదారుల సేవా కేంద్రం తక్కువకాలంలోనే బాగా వృద్ధి చెందిందని ఆయన ప్రశంసించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, సంగం డైరెక్టర్ కల్లూరి సాంబయ్య, పోపురి రంగారావు,
టీడీపీ నాయకులు, సగం డెయిరీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



