టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ
చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ఏపీ టీడ్కో గృహాలలో నివసిస్తున్న వేలాది మంది ఓటర్ల వివరాల మ్యాపింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎన్నికల అధికారులను కోరారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణంలోని టీడ్కో గృహాలలో నివసిస్తున్న సుమారు పదివేల మంది ఓటర్ల వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదుకాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీడ్కో గృహాల ఓటర్లను ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు, అవసరమైతే వారికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, టీపీఎస్ వెంకటేశ్వర్లు పాల్గొని సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లకు పూర్తి స్థాయి శిక్షణ, అవగాహన కల్పించారు.
ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీల బీఎల్ఏలు అధిక సంఖ్యలో పాల్గొనగా, నవతరం పార్టీ, జనసేన పార్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
“టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌లో లోపాలు ఉంటే వేలాది ఓట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎన్నికల అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి” అని రావు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.



