చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
చిలకలూరిపేట, జూన్ 10: హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు (AP 09 BV 1251) పసుమర్రు గ్రామం సమీపంలోని మలుపు వద్ద టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా, సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
– చిలకలూరిపేట లోకల్ న్యూస్



