చిలకలూరిపేట లోకల్ న్యూస్

మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట: దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ, మోదీ సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు.

ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా 2014లో చిలకలూరిపేటకు వచ్చిన సమయంలోనే ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతారని తాను చెప్పానని, ఆ మాట నేడు నిజమైందని ప్రత్తిపాటి తెలిపారు.

దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి అని పేర్కొన్న ఆయన, వారి నాయకత్వంలో దేశం మరియు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీపడటం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– చిలకలూరిపేట లోకల్ న్యూస్

Share.
Leave A Reply