చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డులో సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ముందుగా వార్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కూటమి పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆడక స్వాములు గారు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు తెల్ల సుబ్బారావు గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ S.S సుభాని గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి గారు, క్లస్టర్ ఇన్‌చార్జి ముల్లా కరీముల్లా గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని గారు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ గారు, పార్లమెంట్ కార్యదర్శి అమర రమాదేవి గారు, పోపురి లక్ష్మీ గారు, 9వ వార్డు పార్టీ అధ్యక్షులు గోపిదేశి వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి దాసు గారు, రాయుని పద్మ గారు, కొనిదన సీత గారు, పుల్లగొర ఝాన్సీ గారు, కంచర్ల రాజ్యలక్ష్మి గారు, చావల అనూష గారు తదితరులు పాల్గొన్నారు.
అలాగే కూటమి నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని 45 రోజుల పాటు కొనసాగిస్తూ ప్రతిరోజూ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయనున్నట్లు నాయకులు తెలిపారు.



