బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి
దేశంలోనే భారీ రుణ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం : ఎంపీ లావు
- అర్హులకు రుణాలందించండలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలి : ప్రత్తిపాటి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిబంధనలు సరళీకరించాలి : ప్రత్తిపాటి.
- భారీ రుణ పంపిణీ కార్యక్రమాన్ని కూటమిశ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు సమన్వయం, అంకితభావవంతో విజయవంతం చేయాలి : ప్రత్తిపాటి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా రూ.3,216 కోట్ల రుణాలను లబ్ఢిదారులకు అందించబోతున్నాం : ఎంపీ లావు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు…రాయితీ రుణాలపై అవగాహనతో పొదుపు సంఘాల మహిళలు, రైతులు తమకు నచ్చిన వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణించి ఆర్థికంగా స్థిరపడవచ్చని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. బ్యాంకులు అందించే రాయితీ రుణాలు, ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.
గురువారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, శుక్రవారం నరసరావుపేట ఇండోర్ స్టేడియంలో జరిగే కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులు పాల్గొనే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రుణ పంపిణీ కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై, ఎమ్మెల్యే, ఎంపీ స్వయం సహాయ సంఘాల మహిళలు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రత్తిపాటి, లావు విలేకరులతో మాట్లాడారు.
బ్యాంకులు ఉదారంగా రుణాలిస్తేనే.. ఆర్థిక అసమానతలు తగ్గుతాయి: ప్రత్తిపాటి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో, బ్యాంకుల్ని సమాయత్తం చేసే దిశగా తొలిసారి నరసరావుపేటలో శుక్రవారం భారీ రుణ పంపిణీ కార్యక్రమం జరగబోతోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రూ.3,200 కోట్లకు పైగా రుణాలను లబ్ధిదారులు స్వీకరించబోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కూటమి శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు సమన్వయం, అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేయాలని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. కేంద్ర పథకాలు, వివిధ వర్గాలకు అందించే బీమా పథకాలపై మెప్మా, డ్వాక్రా విభాగాల మహిళలు ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రత్తిపాటి సూచించారు. అలానే అర్హులైన వారికి, సిబిల్ బాగున్న వారికి ప్రభుత్వ, వ్యక్తిగత రుణాల పంపిణీలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని, అప్పుడే దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు తమ నిబంధనలను సరళతరం చేయాలని ప్రత్తిపాటి ఈ సందర్భంగా సూచించారు.
దేశంలోనే భారీ రుణ వితరణ కార్యక్రమం.. క్రెడిట్ అవుట్ రీచ్ : ఎంపీ లావు
దేశంలో తొలిసారి వెనుకబడిన పల్నాడు జిల్లాలో భారీ రుణ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, శుక్రవారం నరసరావుపేటలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతకుa రూ.3,216 కోట్ల రుణ పంపిణీ జరగబోతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే రుణ వితరణ కార్యక్రమానికి దేశంలోని ప్రధాన బ్యాంకుల ఛైర్మన్లు కూడా హాజరవుతున్నారని ఆయన చెప్పారు. సామాన్యలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయనే వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయడానికే శుక్రవారం రూ.3,216 కోట్ల రుణాలను పంపిణ చేస్తున్నట్టు లావు తెలిపారు. తొలిసారి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాదారులైన గిరిజనులకు, గుర్తింపు కార్డులున్న కౌలురైతులకు కూడా రుణాలు పంపిణీ చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. మండలానికో పారిశ్రామిక క్లస్టర్ చొప్పున తొలిసారి జిల్లాలో 28 క్లస్టర్లను రేపు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ప్రారంభించబోతున్నారన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ్, మునీర్ హసన్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, గట్టా హేమ, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, బేరింగ్ మౌలాలి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, సి.యం.యం. పద్మజా, మూడు మండలాల ఎంపిడిఓ లు, సి.ఓ లు, వివిధ హోదాలలో ఉన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.



