ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- మురికిపూడికి చెందిన 30 మంది చెంబేటి కుటుంబ సభ్యులు.. 20 వైసీపీ కుటుంబాలను సాదరంగా టీడీపీలోకి స్వాగతించిన ప్రత్తిపాటి
చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన వైసీపీ సానుభూతిపరులైన 20 కుటుంబాలకు చెందిన వడ్డెరలు, చెంబేటి కుటుంబసభ్యులైన మరో 30 మంది బుధవారం ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్తిపాటిని ఆయన నివాసంలో కలిసిన వైసీపీ కార్యకర్తలు… ఆ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అధినేత జగన్ దిగజారుడు రాజకీయాలు, నేరస్వభావ మనస్తత్వాన్ని భరించలేకే తాము టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలిపారు. వారి కోరికను మన్మించిన ప్రత్తిపాటి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి చంబేటి వెంకటేశ్వర్లు, శ్రీను, పెద్ద వెంకటేశ్వర్లు, వేముల సుబ్బాయమ్మ, గుంజి పేరయ్య, వెంకటేశ్వర్లు, బత్తుల ఏసుదానమ్మ, మిగిలిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, టీడీపీ నాయకులు గుంజి శ్రీనివాసరావు, చిగురుపాటి రాజా బాబు, కొమ్మనబోయిన రామారావు, సిద్దయ్య, ఉయ్యాల గోవిందు, కుంభా సుబ్బారావు, పఠాన్ సైదా, షేక్ బాజీ, గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



