చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం

చిలకలూరిపేట మండలం లోని పోతవరం మరియు మద్దిరాల గ్రామాల్లో కూటమి ప్రభుత్వ “రెండేళ్ల పాలన – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ గారు, క్లస్టర్ ఇంచార్జీ గంజి శ్రీనివాసరావు గారు, పోతవరం గ్రామ పార్టీ నాయకులు పఠాన్ బాజీ గారు, హజరత్ గారు, మద్దిరాల గ్రామ పార్టీ నాయకులు పయ్యావుల సాంబశివరావు గారు, మాలెంపాటి సుబ్బారావు గారు, గోరంట్ల నరసింహారావు గారు తదితరులు పాల్గొన్నారు.

నాయకులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రతి వర్గానికి కలిగిన ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు. ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పిలుపునిచ్చారు.

Share.
Leave A Reply