ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని RVSCS హైస్కూల్‌లో ప్రధాని శ్రీ నరేంద్ర మోది పుట్టినరోజు పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
గెలుపొందిన విద్యార్థులకు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా మొదటి, రెండవ, మూడవ బహుమతులు (షీల్డులు) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు , మాజీ పల్నాడు జిల్లా నెల్లూరు ఈశ్వర్ రంజిత్ , పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ , ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య , బిజెపి నాయకులు కూటమి నాయకులు, RVSCS హైస్కూల్ సుధాకర్ మాస్టర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



