కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (APJPS) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
చిలకలూరిపేట పట్టణంలోని మెడికల్ హాల్ నందు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (APJPS)వారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారం మరియు హక్కుల సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సీనియర్ రిపోర్టర్స్ దార్ల బుజ్జి బాబు, షేక్ అల్లాబక్షు, మురికిపూడి ప్రసాద్ గార్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా రాసేటటువంటి వార్తలో నిజం ఉంటే అందరూ మీకు అండగా ఉంటారు. బ్లాక్మెయిలింగ్ కోసం రాసే వార్త కోసమే అయితే సమాజం అండగా ఉండదు పోలీసులు బెదిరింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం రాసే వార్తలో సత్యం ఉండాలి పదిమందికి ఆ వార్త ద్వారా ఉపయోగం జరగాలి. పాత్రికేయ వృత్తి అంటేనే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల పడుతున్న సమస్యలు తెలియజేస్తూ ప్రజలను నాయకులను అధికారులను చైతన్యవంతులను చేయడమే లక్షం .
కొంతమంది సీనియర్ రిపోర్టర్స్ కి సన్మానం చేయాలని, యూనియన్ సమస్యలు ఇబ్బందులు చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని మీరు తప్పక రావాలని మల్లెల శివ నాగేశ్వరావు గారు, బాలస్వామి గారు తదితర మిత్రులు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు.
దార్ల బుజ్జిబాబు గారు షేక్ అల్లాభక్షు గారు మురికిపూడి ప్రసాద్ గారు ముగ్గురు కూడా వారి వారి వృత్తుల్లో అనుభవం గడిచిన వ్యక్తులు ముగ్గురి ఆలోచన సరళి చాలా ప్రత్యేకం.
దార్ల బుజ్జిబాబు గారు ఒక మనిషి ఉన్నత స్థితికి జ్ఞానపరంగా ఏ రకంగా ఎదుగుతాడో బుజ్జిబాబుని చూసి నేర్చుకోవాలి తన జ్ఞాన పరిధిని విస్తరించుకుంటూ వృత్తిలో బాగా రాణించాడు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం అన్నారు .
మురికిపూడి ప్రసాద్ గారు సమాజ సేవ చేయడంలో ముందున్నారు చాలా చిన్న వయసు నుండి పట్టణంలోని పేదలకి, నిరాదరణకి గురైన వృద్ధులకు అందరికీ రెండు పూటలా భోజనం వస్తే కల్పించి సుమారు 20 సంవత్సరాల నుండి నిరాటంకంగా భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం సమాజసేవే పరమావధిగా అని నమ్మిన వ్యక్తి ఆయన.
ప్రతి సమస్యని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అలా చేయగల శక్తి అల్లాభక్షు గారికి ఉంది అన్నారు. అవి చాలా గొప్పగా కూడా ఉంటాయి. అందుకు కారణం ఆయన ఇప్పటికీ పుస్తకాలు బాగా చదువుతూ ఉంటాడు సమాజంలో ఉన్న సమస్యల పట్ల నిర్భయంగా వార్తలు రాసేవాడు అని ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిలబడ్డాడు అని అన్నారు .
పాత్రికేయ వృత్తిలో గుర్తింపు గౌరవం మాత్రమే దక్కుతాయి ఇందుకోసం తమ జీవితాలను కూడా త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. ఈ వృత్తిలోకి ఒక్కసారి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి బయటికి పోలేక ఇందులోనే ఉండలేక అనేకమంది అనేక ఇబ్బందులు పడుతున్నా సరే ఇందులోనే తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇది కూడా సమాజసేవే, ప్రజలకు చేస్తున్న సేవే అన్నారు
ఈ కార్యక్రమంలో వారివెంట అచ్చుకోల మురళీకృష్ణ గారు , అంజిరాజు గారు ,పమిడి శ్రీనివాస్ గారు తదితరులున్నారు



