గణపవరం జాతీయ రహదారిపై స్పీడ్ బారికేడ్ల ఏర్పాటు

నాదెండ్ల: నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపవరం జాతీయ రహదారిపై వాహనాల అతివేగాన్ని అరికట్టి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. సీఐ సుబ్బ నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఏఎస్ఐ రమేష్, రైటర్ అనిల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై రిఫ్లెక్టర్లతో కూడిన స్పీడ్ బారికేడ్లను (డ్రమ్ములను) సోమవారం ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో సైతం వాహనదారులకు స్పష్టంగా కనిపించి వారిని అప్రమత్తం చేసేలా ఈ డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు, లైటింగ్ సదుపాయాన్ని అమర్చారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితమైన వేగంతో వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Share.
Leave A Reply