సేవా సంకల్ప్ అభియాన్ లో పాల్గొన్న ప్రత్తిపాటి

  • విదార్థులకు పెద బాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డులో స్థానిక బీజేపీ నాయకులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి ఆయన స్థానిక మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు పెదబాలశిక్ష మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, గట్టా హేమ, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply