పెద్దఎత్తున సంక్షేమం అందిస్తోన్న ఏకైక నాయకుడు చంద్రబాబే : ప్రత్తిపాటి

  • ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్న మాటకు చంద్రబాబు కట్టుబడ్డాడు.
  • ఆర్థిక భరోసాతో పాటు, పేదల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంచారు.

ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉంటానన్న మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడ్డారని, పేదల సేవలో పేరిట ప్రతినెలా 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంచుతున్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

గురువారం ఆయన నియోజకవర్గంలో పలు గ్రామాలు, వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. తొలుత పట్టణంలోని 13, 17 వార్డుల్లో, పేదలోసేవలో పాల్గొన్న ప్రత్తిపాటి. తరువాత చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెం, గంగన్న పాలెం, నాదెండ్ల మండల కేంద్రంలో పేదల ఇళ్లకు వెళ్లి, స్వయంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. పింఛన్లు అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ప్రజల్ని ఆదుకోవడంలో చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు..
దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని, ఆర్థిక సమస్యలున్నా.. ప్రజల్ని ఆదుకోవడంలో ఆయన వెనకడుగు వేయడం లేదని ప్రత్తిపాటి తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపచం గర్వించేలా అన్నిరంగాల్లో నంబర్ 1 గా నిలపాలన్న లక్ష్యసాధన కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని దేశంలోనే మేటిగా నిలిపారన్నారు. పథకాల అమలైనా, అభివృద్ధి నిర్మాణాలైనా, సాగునీటి ప్రాజెక్టుల పనులైనా కూటమి ప్రభుత్వం వచ్చాకే ఊపందుకున్నాయని, జగన్ ప్రభుత్వంలో భూతద్దంలో వెతికినా ఎక్కడా మచ్చుకైనా ప్రజలకు అభివృద్ధి కనిపించలేదని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, గట్టా హేమ, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, సయ్యద్ వహబ్, గంగా శ్రీనివాసరావు, పిల్లి కోటేశ్వరరావు, పిల్లి లెనిన్, మచ్చా వెంకటేశ్వర్లు, తోకల్ వెంకటేశ్వర్లు, బీడింగ్ కరిముల్లా, తన్నీరు పుల్లారావు, షేక్ నాగురా, తుపాకుల అప్పారావు, కుంబా నాగేశ్వరరావు, మన్నం శివయ్య, అరిగేలా కోటి, ఉమామహేశ్వరరావు, కుమార్, పిచ్చయ్య, మామిల్లపల్లి చందు, నల్లమోతు హరిబాబు, పూర్ణయ్య, సూరి బాబు, వేములపల్లి బసవయ్య, వెంకటేశ్వర్లు, వేములపల్లి శరత్, అనిల్, వెంకయ్య, టీడీపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply