జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

విషయం : 2026 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా గుర్తించి అధికారికంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి.

2026 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో పడకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 268 మండలాలు తీవ్రంగా, 245 మండలాలు మోస్తరు కరువు పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. తుది ప్రతిపాదనలు సెప్టెంబర్ 24లోగా పంపించి, అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రావ్యాప్తంగా 100 కరువు మండలాలు అంచనాలు పెరగడం ఆందోళనకరం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా మా ప్రతినిధులు గ్రామాల్లో రైతులు, కౌలు రైతులు మరియు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. పంటలు ఎండిపోవడం, సాగునీరు లేకపోవడం, బోర్లలో నీటి మట్టం తగ్గడం, తాగునీటి సమస్య, పశువులకు మేత కొరత మరియు రైతుల ఆర్థిక ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. కాబట్టి, కరువు మండలాలను కేవలం వర్షపాతం ఆధారంగా కాకుండా గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి గుర్తించాలని కోరుతున్నాము.

మా విజ్ఞప్తులు

  • మండలాలు, గ్రామాల వారీగా పంట నష్టం మరియు కరువు పరిస్థితులపై ప్రత్యేక సర్వే నిర్వహించాలి.
  • సాగు విస్తీర్ణం, ఎండిపోయిన పంటలు, పంట నష్టం మరియు రైతుల వివరాలు నమోదు చేయాలి.
  • 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం ఉన్న రైతులకు నిబంధనల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి.
  • పంట బీమా పరిహారం, ప్రత్యామ్నాయ విత్తనాలు మరియు తదుపరి సాగుకు అవసరమైన సహాయం అందించాలి.
  • తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి, పాడైన బోర్లు మరియు పైప్‌లైన్లను మరమ్మతు చేయాలి.
  • పశువులకు మేత, తాగునీరు మరియు పశువైద్య సేవలు అందించాలి.
  • రైతులు మరియు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చెరువుల పూడికతీత, ఇంకుడుగుంటలు, చెక్‌డ్యామ్‌లు మరియు ఫారం పాండ్ల నిర్మాణ పనులు చేపట్టాలి.
  • చెరువులు, కాలువలు మరియు రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిశీలించి సాగునీటి ప్రణాళిక రూపొందించాలి.
  • భూగర్భ జలాల పరిస్థితిని గ్రామాల వారీగా పరిశీలించి నీటి సంరక్షణ, రీచార్జ్ పనులు చేపట్టాలి.

కరువు మండలాలను ప్రకటించిన వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా, ప్రత్యామ్నాయ విత్తనాలు, తాగునీరు, పశుగ్రాసం మరియు ఉపాధి చర్యలు అందేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలి.
కాబట్టి, పై అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కౌలు రైతులు మరియు గ్రామీణ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మనవి.

ధన్యవాదములతో,
భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా

Share.
Leave A Reply