పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం లో భాగంగా డిఆర్ఓ గారికి పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఎమ్మార్వో ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అలాగే మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ ని మేనేజ్ చేసి ఏడుగురు పేరు మీద ప్రభుత్వానికి సంబంధించిన సర్వే నెంబరు 138/1 సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అమ్మే వేయడం కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అలాగే ఆ స్థలంలో ఉన్న బిల్డింగులు పడవేస్తున్నారు పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ అధికారులు అందరి పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply