చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి

చిలకలూరిపేటలోని 52 ఎకరాల స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు వినతి పత్రం సమర్పించారు.

దేవాలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎండోమెంట్ కమిషనర్‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారికి సిఫార్సు లేఖ అందించాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించి, సంబంధిత అధికారులకు సిఫార్సు చేయాలని పత్తిపాటి పుల్లారావును మల్లెల శివ నాగేశ్వరరావు కోరారు.

Share.
Leave A Reply