మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు

భయపడకుండా ఓటు వేయాలన్న టౌన్ సిఐ పి రమేష్

పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలతో 150 మంది ప్రత్యేక బలగాలతో రూట్ మార్చ్.. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత!

చిలకలూరిపేట:
రాబోవు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు మరియు ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ధైర్యం కల్పించేందుకు పోలీసులు భారీ సాయుధ కవాతు నిర్వహించారు.
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలు మరియు సూచనల మేరకు, చిలకలూరిపేట టౌన్ సిఐ పి. రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం (09.10.2026) సాయంత్రం 150 మంది ప్రత్యేక బలగాలతో ఈ కవాతు సాగింది.
పట్టణంలోని NRT సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ సాయుధ కవాతు, చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్ మీదుగా అడ్డరోడ్డు వరకు సాగింది. ముఖ్యంగా పట్టణంలోని సున్నిత (Sensitive), అత్యంత సున్నిత (Hyper-sensitive) ప్రాంతాల్లో ఈ కవాతును నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణలో “మేమున్నాం..

మీకు అండగా!” అనే నమ్మకాన్ని ప్రజల్లో నింపారు.
ఈ సందర్భంగా టౌన్ సిఐ రమేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను భయాందోళనలకు గురిచేసినా సహించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ రూట్ మ్యాప్ నందు పట్టణ సీఐ పి. రమేష్ తో పాటు ఎస్ఐ సోమేశ్వరరావు, ఎస్ఐ హాజరత్తయ్య మరియు పట్టణ పోలీస్ ಸಿబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply