మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రత్తిపాటి.
- సేవా జ్యోతియాత్ర ర్యాలీలో హుషారుగా బుల్లెట్ నడిపి, కూటమి శ్రేణుల్ని ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై నేటి యువత ఆలోచన చేయాలని, ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచగురువుగా మారిన తీరుని ఒక పాఠ్యాంశంగా అధ్యయనం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
గురువారం చిలకలూరిపేట పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఎన్.ఆర్.టీ కూడలి నుంచి రిజిస్త్రార్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో ఆయన హుషారుగా బుల్లెట్ నడిపి, కూటమి శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం ప్రత్తిపాటి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
25 ఏళ్ల ప్రజాసేవ.. సామాన్య విషయం కాదు..
ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు నిర్విరామంగా ప్రజలకు, దేశానికి సేవలు అందించడం సామాన్య విషయం కాదని, ఈ అంశంలో మోదీ సాధించిన ఘనతను యావత్ ప్రపంచమే కొనియాడుతోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
నేటి యువత మోదీ నాయకత్వాన్ని, ఆయన పాలనా తీరుని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ఎన్డీయే ప్రభుత్వం సాధిస్తోన్న ఘన విజయాలు, సుపరిపాలనపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, పుల్లయ్య, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, కొత్త కోటేశ్వరరావు, పిల్లి కోటేశ్వరరావు, మురకొండ మల్లిబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



