చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 14 మందిపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
పట్టుబడిన వారిని చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ మహబూబ్ సుభాని ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. దీంతో 14 మందికి కలిపి మొత్తం రూ.14,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.



