నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- జల్ జీవన్ మిషన్ నిధులతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు.
- 27 గ్రామాలకు సాగర్ నుంచి కృష్ణా జలాల తరలిస్తాం.
- రూ. 67 కోట్లతో త్వరలోనే పనుల ప్రారంభం.
- మానుకొండవారిపాలెంలో రూ.40 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి.
- పల్లెపండుగ 3.0లో భాగంగా యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రత్తిపాటి, మర్రెడ్డి.
గత పాలకుల అసమర్థ పాలనతో నియోజకవర్గం అభివృద్ధికి దూరమైందని, చివరకు ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా అందించలేకపోయారని, కూటమి ప్రభుత్వ కృషితో త్వరలోనే ప్రజలకు కృష్ణా జలాలు అందనున్నాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో శనివారం ప్రత్తిపాటి పలు అభివృద్ధి పనుల ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, తొలుత యడ్లపాడు మండలం సందెపూడి ఎస్సీ కాలనీలో రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చిలకలూరిపేట మండలం వేలూరులో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, పాఠశాల ప్రహరీలను ఇరువురు నాయకులు ప్రారంభించారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించే సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చివరిగా మానుకొండవారిపాలెంలో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజల తాగునీటి కష్టాలకు పరిష్కారం.. రూ.67 కోట్లతో 27 గ్రామాలకు కృష్ణా జలాలు.
నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నామని, జల్ జీవన్ మిషన్ (జేజేఎమ్) లో భాగంగా తొలుత 27 గ్రామాలకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించబోతున్నామని, ఇందుకోసం రూ.67 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రధాన సమస్యను పరిష్కరిస్తే, ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆయన తెలిపారు. మానుకొండవారిపాలెం నాయకులు అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఒక సమస్య తీర్చిన వెంటనే మరోదాన్ని వెంటనే తనముందు పెడతారని ప్రత్తిపాటి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పొలాలకు వెళ్లే రోడ్లకు కూడా మహర్దశ పట్టిందన్నారు.
ప్రత్తిపాటి నాయకత్వంలో వేగవంతమైన అభివృద్ధి : మర్రెడ్డి.
ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సంక్షేమానికి తీవ్రంగా కృషి చేశారని రాష్ట్ర వ్యవసాయ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల మేలు కోరే నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు అని, ఆయన నాయకత్వంలో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జలమే జీవమనే నానుడిని ప్రభుత్వం ఆచరణలో నిజం చేస్తోందని, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే దిశగా సాగుతోందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు మద్దినేడి శివరామకృష్ణ, సుబ్బారావు, సీతారామయ్య, వేణు, ప్రభుదసు, రాజేష్, వీర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, అధికారులు డి.ఈ అరునాధబాబు, ఏ.ఈ సూర్యతేజ, హరిబాబు, టీడీపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



