శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం విజయవంతం
కేంద్ర, రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, శావల్యాపురం మండల అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వారపు జనతా వారధి కార్యక్రమం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను ఈ విధంగా తెలియజేశారు:
- ఎస్టీ, బీసీ కాలనీలలో మురుగు నీరు గన్నేరు వాగులో కలుస్తున్నందున ఉపాధి హామీ పథకం కింద కాలువ నిర్మించాలని కోరారు.
- ఆంజనేయస్వామి ఆలయం నుండి శివాలయం వరకు వెళ్లే రహదారిపై నీరు నిల్వ ఉండటం, సైడ్ డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు.
- జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కోట్లాది రూపాయలతో పనులు పూర్తయినప్పటికీ, సరఫరా అవుతున్న తాగునీరు కలుషితంగా ఉందని, శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందించాలని కోరారు.
- మార్కుల జాబితా ఆధారంగా ఆధార్ కార్డులో జన్మతేదీ మార్పులు చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- ప్రభుత్వం అందించబోయే అన్ని రకాల పెన్షన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలని కోరారు.
- మరుగుదొడ్డి నిర్మించకపోయినా నిర్మించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిధులు మంజూరైనట్లు చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఒక మహిళ మరణించి ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ చంద్రన్న బీమా ఇప్పటివరకు మంజూరు కాలేదని, వెంటనే మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు.
ఈ సందర్భంగా వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తమ వంతు కృషి చేస్తుందని నాయకులు దరఖాస్తుదారులకు హామీ ఇచ్చారు.
ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా
జనతా వారధి
భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా



