తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం:రజిని
AP: సోషల్ మీడియా లో తన పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC), జాతీయ మహిళా కమిషన్ (NCW)లకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి విడదల రజిని. ఏబీఎన్ ఛానల్ ద్వారా తాను తీవ్రమైన దూషణలకు గురవుతున్నానని, వ్యక్తిత్వ హననకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, మాజీ మంత్రి ఆర్కే రోజాపైనా ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.