మద్యం తాగి కింద పడిన వ్యక్తిని టిడిపి వ్యక్తులు కొట్టారనడం మంచి పద్ధతి కాదు

కొత్త బోధనం ఉప సర్పంచ్ తోట శ్రీనివాసరావు

రాజుపాలెం మండలం కొత్త బోధనం గ్రామంలో రాంపాటి శ్రీహరి అనే వ్యక్తి మద్యం తాగి కింద పడిపోయి దెబ్బలు తగిలితే ఆ విషయాన్ని పక్కన పెట్టి వైసిపి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేడు అతని పరామర్శించి టిడిపికి చెందిన వ్యక్తులు దాడి చేశారంటూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే శ్రీ హరి అనే వ్యక్తి తన పేరే సరిగా రాయలేనప్పుడు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలియజేయలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేస్తారు కానీ ఎక్కడ కూడా దాడులకు పాల్పడరు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడితే గ్రామాలలో గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ పద్ధతిని మార్చుకోవాలని పేర్కొన్నారు. దాడే జరగనప్పుడు కావాలని వ్యక్తుల పేర్లు చెప్పడం అనేది వైసిపికే చెల్లుతుందన్నారు. ఇప్పటికే గ్రామంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన దగ్గర నుండి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే వైసిపి నాయకులు అభివృద్ధి పనులు అడ్డుకునేది కాక దాడులు చేస్తున్నారంటూ మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. ఈప్పటికైనా వైసీపీ నాయకులు గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు.

Share.
Leave A Reply