మీ పుట్టినరోజున ఒక మొక్క నాటండి” కార్యక్రమం
చిలకలూరిపేట:అమ్మి ఫౌండేషన్ చేపట్టిన మీ పుట్టినరోజున ఒక మొక్క నాటండి” ఉద్యమంలో భాగంగాపేట తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ స్వయంగా మొక్కను నాటి, ఫౌండేషన్ చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని అభినందించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ప్రజలలో పర్యావరణంపై అవగాహన పెంచాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటడాన్ని అలవాటు చేసుకుంటే, మన పట్టణాలు తిరిగి పచ్చగా మారతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రోషన్, ఈశ్వర్, అమ్మి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ షేక్ అఫ్రోజ్ తో పాటు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ సర్వేయర్లు, VROలు, MRO కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.