ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందజేత
దివ్యాగులకు చేయూత నిస్తున్నా ఇన్నర్ వీల్ క్లబ్
మహిళ ల ఆర్థిక సహాయం తో సేవా కార్యక్రమాలు
స్నేహం, సేవా అనే దృక్పథంతో ఇన్నర్‌వీల్ క్లబ్ పని చేస్తుందని క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని అన్నారు.
ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలీ కాలనీలో నివాసం ఉండే కోటమ్మబాయి అనే దివ్యాంగురాలికి శుక్రవారం ట్రైసైకిల్ అందజేశారు.
స్థానిక స్వాతి జ్యువలర్స్ అధినేత కొత్తూరి సూర్య నారాయణ అందించిన ఆర్దిక సహాకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు గట్టు సరోజిని తెలిపారు.
గతం నుంచి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సేవకు ప్రతిరూపంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇన్నర్ వీల్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి దోహదపడతాయని వెల్లడించారు.
క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నార్నే జయలక్ష్మి, పాస్ట్ ప్రెసిడెంట్ తియ్యగూర రమాదేవి, డాక్టర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.