శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు – లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి గారి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
బ్యాటరీ దొంగలు అరెస్ట్. బోప్పూడి గ్రామ పరిదిలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వున్న టిప్పర్ లారీ యొక్క రెండు బ్యాటరీలును 16.05.2025 వ తేదీ మద్యాహ్నం దొంగతనం చేసినట్లు నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన మలిశెట్టి శ్రీనివాసరావు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి రెండు గంటల వ్యవదిలో ముద్దాయిలు అయిన 1. సయ్యద్ బాబు s/o [లేటు] అబ్బు @ అబ్దుల్లా, 33 సం పోలేరమ్మ గుడి వద్ద, మిలటరీ కాలనీ, ఒంగోలు పట్టణం.
తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చిలకలూరిపేట:రాజకీయాలలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు అండగా ఉంటున్న పార్టీ జనసేనపార్టీ అని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణములోని రజక కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా వుంటున్నారని, నీతి నిజాయితీలతో పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు అని అన్నారు.అనంతరం క్రియాశీలక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవి మేధాన్ష్ కు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జనసేన యువనాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట :జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ నవతారంపార్టీ జాతీయ నాయకులు రావు సుబ్రహ్మణ్యం మనవడు మేధాన్ష్ అనే చిన్నారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీలో చురుకైన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన చరణ్ తేజ, రాజకీయాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారిఆనందంలోపాలుపంచుకుంటారు.ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, “చిన్నారి మేధాన్ష్ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల చిరునవ్వులు, వారి ఆనందమే మనందరికీ మానసిక ఉల్లాసాన్ని స్ఫూర్తినిస్తాయి. మేధాన్ష్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.చరణ్ తేజ, మేధాన్ష్ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పిల్లలను చక్కగా ఉన్నత విలువలతో పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త…
గ్రామ స్థాయి లో నివసించే వారు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి పసుమర్రు గ్రామం లో పల్లెనిద్ర చేసిన చిలకలూరిపేట రూరల్ SI అనీల్ నేటి సమాజం లో జరిగే అన్యాలపై, మహిళా లపైజరుగుతున్న దాడుల పట్ల గ్రామస్తులు అప్రమత్తం గా ఉండాలి-SI అనీల్ అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి-SI అనీల్ కేసులపై, చట్టాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి-SI అనీల్ ఈ పల్లె నిద్ర లో పలు అంశాలు పై చర్చించారు. గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు దివ్య – జైకర్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారితో మాజీ జడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు గారు, అత్తోట జోసెఫ్ గారు తదితరులున్నారు.
భారీ స్కామ్ లో ఇరుక్కున్న చిలకలూరిపేట మున్సిపల్ ఉద్యోగులు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లో పదిమంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిరావు. ఐదుగురు హయ్యర్ అఫీషియల్స్ ని ప్రభుత్వానికి లేఖ రాసిన మున్సిపల్ శాఖ గత వైసీపీ ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇక్కుర్తి గంగాభవాని 34.34 లక్షలు స్కామ్ అందులో 12.94 లక్షలు ప్రభుత్వానికి జమ చేశారు. స్కామ్ లో పాత్ర పోషించిన ఉద్యోగులు పేర్లు. Ri లు1. దావూద్2. జమీర్3.మానస కృష్ణ (సీనియర్ అసిస్టెంట్) 4.వెంకటేశ్వర్లు5.గురవయ్య6.రమేష్ బాబు 7.శ్రీనివాసమూర్తి 8.అల్లాబక్షు9.అబ్దుల్ ఖాదర్ 10.ధనలక్ష్మి(J.a)ఈ పదిమంది స్కాం తాలూకా సస్పెండ్ అయిన ఉద్యోగస్తులు. చుక్కల .గోవిందరావు ( కమిషనర్)రవీంద్ర (కమీషనర్) విజయలక్ష్మి (మేనేజర్ ) నగీనా సుల్తానా (మేనేజర్) ఈ ఐదుగురుపై మున్సిపల్ శాఖ, ప్రభుత్వానికి అటాచ్మెంట్ చేసింది. మిగిలిన ఉద్యోగులపై చర్యలుపై ఉత్తర్వులు రావాల్సింది.
జూన్ 12 తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం”సూపర్ సిక్స్” లో భాగంగా ప్రతి తల్లితండ్రులకు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి 15,000 జూన్ 12తేదిన అమలు చేయబోతున్నారు అలాగే రైతులకు “అన్న దాత సుఖీభవ” పథకం కింద మూడో విడతల్లో 20,000 జమ అవుతాయని అన మాచర్ల నియోజక వర్గ శాసన సభ్యులుజూలకంటి బ్రహ్మానందరెడ్డిమాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడుకొమెర దుర్గారావుకలసి తెలియయటం జరిగింది.
రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులునారా చంద్రబాబు నాయుడు గారుమంత్రి వర్యులు నారా లోకేష్ గారిస్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలు మేరకుగ్రామ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందిపల్నాడు జిల్లా ,సత్తెనపల్లి నియోజక వర్గంరాజుపాలెం మండలంచౌటపాపాయపాలెం అర్ఆర్ సెంటర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా(ST) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగత 30 ఏండ్లు గా పార్టీ కోసం నిరంతరంతన వంతుగా కృషి చేస్తున్న నాయకుడుమెరుగురత్తయ్యగారిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగిందిఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులుగ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు రొంపిచర్ల మండలం అలవాల గ్రామం నందు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు ఈ కార్యక్రమనికి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని అలవాల గ్రామంలో పర్యటించారు ప్రజల నుండి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను గ్రామంలోని ప్రజలకు వివరించారు పార్టీ నాయకులతో పలు సమస్యల పై చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పలు కార్యక్రమలు చేపడుతున్నామని ప్రజా వేదిక పల్లెనిద్ర కార్యక్రమలు చేస్తున్నామని పట్టణంలో ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వచ్చే నెల నుండి విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు ఆర్ధిక…









