పేటలో బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధం: మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు

చిలకలూరిపేట: ఈ నెల 7వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు . గోవధను నిషేధిస్తూ, పశు సంరక్షణ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ పి .శ్రీహరి బాబు స్పష్టం చేశారు.యానిమల్ హస్బెండరీ యాక్ట్ నెం.11/1977 మరియు హైకోర్ట్ ఉత్తర్వులు WP 30. 26505 తేదీ 23-12-2005 గోవద నిషేధం చట్టం పశునిషేధిత సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. ఈ చట్టాల ప్రకారం ఆవులను, దూడలను, అలాగే ఇతర ఉపయోగకరమైన పశువులను వధించడం పూర్తిగా నిషేధించబడింది.ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ పి .శ్రీహరి బాబు హెచ్చరించారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share.
Leave A Reply