పేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం
చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు, డి ఈ రహీం, మరియు కౌన్సిలర్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో, మున్సిపల్ బృందం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటింది.ఈ వన మహోత్సవంలో ప్రజా ప్రతినిధులు స్వయంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. పట్టణ ప్రజలందరూ మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం ద్వారా పచ్చని చిలకలూరిపేట నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కల పెంపకం అత్యవసరమని వారు తెలిపారు



