మెగా డీఎస్సీ నిర్వహణ కూటమిప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • నిరుద్యోగులకు న్యాయంచేస్తామన్న వాగ్దానాన్ని సాధ్యం చేసిన ఘనత చంద్రబాబు, మంత్రి లోకేశ్ లదే .
  • మంత్రి లోకేశ్ దూరదృష్టి, ప్రణాళికతో ఆగస్ట్ నాటికి విధుల్లో చేరనున్న 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు “ ఏళ్ల తరబడి అమలుకు నోచుకోని మెగా డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమమైంది. కూటమిపార్టీల ఎన్నికల హామీ ఆచరణ సాధ్యం కానుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సన్నద్ధమవుతున్న లక్షలాది నిరుద్యోగుల కలలు సాకారం కానున్నాయి. నేడు జరిగే మెగా డీఎస్సీ ఆన్ లైన్ పరీక్ష నిర్వహణకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ పోస్టులైన ఎస్జీటీ, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ సహా మొత్తం 16,347 పోస్టుల భర్తీకి కీలకమైన ఆన్ లైన్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్టు చేసింది. ఈ నెల 6 నుంచి వచ్చేనెల 6 వరకు ఏపీ డీఎస్సీ 2025 జరగనున్న అన్నిపరీక్షలు సక్రమంగా సకాలంలో నిర్వహించి, ఆగస్ట్ రెండోవారానికల్లా కొత్త టీచర్లకు నియామకపత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియామక ప్రక్రియకు సబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు.. మొత్తం 5.67 దరఖాస్తులు సమర్పించినట్టు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

ఎన్నాళ్లుగానో పరీక్షలకు సన్నద్ధమవతున్న లక్షలాది అభ్యర్థులు నేడు జరిగే ఆన్ లైన్ పరీక్షను సమర్థవంతంగా పూర్తిచేయాలి. ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్ష పూర్తిచేసి, తర్వాత జరిగే అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా ముగించాలని ఆశిస్తున్నా. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకొని, నిబంధనల ప్రకారం పరీక్ష పూర్తిచేయాలి.

లోకేశ్ ప్రణాళిక.. దూరదృష్టి వల్లే ప్రశాంతంగా మెగా డీఎస్సీ నిర్వహణ

తమ ఆశలు… ఆకాంక్షలు గ్రహించి, వాటిని నిజం చేయడానికి కూటమిప్రభుత్వం ఎంతో కృషిచేసిందనే వాస్తవాన్ని డీఎస్సీ అభ్యర్థులు గ్రహించాలి. డీఎస్సీ నిర్వహణకు ఉన్న అడ్డంకులు, ప్రతిబంధకాలను తొలగించేందుకు విద్యార్థి.. ఉపాధ్యాయ సంఘాలతో లోకేశ్ పలుమార్లు చర్చించారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపేలా అధికారయంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేశారు. గత పాలకుల మూర్ఖపు నిర్ణయాలతో గాడితప్పిన రాష్ట్ర విద్యావ్యవస్థను నిలబెట్టేందుకు, విద్యార్థులు.. ఉపాధ్యాయుల ఆలోచనలకు అనుగుణంగా సత్ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా మంత్రి లోకేశ్ ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్న సంస్కరణలు అమలుచేశారు. పది, ఇంటర్ ఫలితాలు మనమిత్ర యాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం అనాలోచితంగా ఇచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు. విద్యాకిట్లపై ప్రభుత్వ చిహ్నాలు,, నాయకుల బొమ్మలకు స్థానం లేకుండా చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట ఆయన చిత్రం మాత్రమే ముద్రించిన కిట్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ ఇప్పటికే అధికారులకు సూచించారు. కూటమిప్రభుత్వం విద్యార్థులకు అందించే కిట్లలో పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, నిఘంటువు, వర్క్ బుక్స్, యూనిఫామ్, బెల్టులు, బూట్లు ఉండనున్నాయి. కిట్ల పంపిణీతో పాటు తరగతులు, పాఠశాలల నిర్వహణలో కూడా లోకేశ్ తనదైన ముద్ర వేశారు. విద్యార్థుల ఆలోచనలు, వారి భవిష్యత్ గురించి తప్ప మరే ఆలోచనలవైపు మళ్లకుండా సరికొత్త బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. పాఠశాలలు పున: ప్రారంభమయ్యే నాటికి విద్యాకిట్లు అన్నీ విద్యార్థులకు అందించేలా విద్యాశాఖాధికారుల్ని మంత్రి లోకేశ్ అప్రమత్తం చేశారు. ఆగస్ట్ లో నిర్వహించబోయే వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్న పట్టుదలతో లోకేశ్, అన్నిశాఖల అధికారులకు ఇప్పటికే కీలకసూచనలు చేయడం జరిగింది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టంచేశారు

Share.
Leave A Reply