మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు

పర్యావరణ దినోత్సవ సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు గారు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి తమ ఇల్లు, పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించి, నారసంచులను ఉపయోగించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు నాగ శ్రీను రాయల్ గారు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply