భూమికోసం, భుక్తికోసం పేద ప్రజల విముక్తి కోసం సీపీఐ
పేదల కోసం పోరాడేది కమ్యునిస్టులే
సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్
చిలకలూరిపేట:భూమి కోసం, భుక్తి కోసం. పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ కే సొంతమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. బుధవారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలోని రూత్‌డైక్‌మెన్ నగర్‌శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, సిపిఐ తోనే సమస్యల పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. కమ్యునిజానికి అంతం లేదని పుట్టగొడుల్ల పుట్టుకొచ్చే పార్టీలు అధికారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న ఈ రోజుల్లో వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికీ ఓ దిక్సూచి అని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులను ఎదుర్కొని కార్మికులకు ఎనిమిది గంటల పనిదినాలు, ఉపాధి హామీ చట్టం, దున్నే వాడిదే భూమి అంటూ ఎన్నో చట్టాల అమలులో కమ్యూనిస్టుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. కార్మిక హక్కుల సాధనకై కార్మికుల కోసం కర్షకుల కోసం పేదవాడి ఆకలి తీర్చడానికి పోరాటాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, దేశ స్వతంత్రం కోసం పోరాడి ఎంతో మంది అమరలయ్యారని వివరించారు. నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం లక్షలాది మందిని సమీకరించి భూపోరాటాలు నిర్వహించిన చరిత్ర సీపీఐ ది మాత్రమేనని అన్నారు.
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి…
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను హరించేలా దాడి కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద ఎజెండా ను అమలుచేస్తూ రాజ్యాంగ హక్కులను హరిస్తోందని ఆరోపించారు. ఎంతోకాలంగా పోరాటాలతో సాధించిన కార్మిక చట్టాలను కాలరాసి వాటి స్థానంలో లేబర్ కోడ్‌లను తీసుకురావడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చటంలో విఫలమయ్యారని తెలిపారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం ప్రకటన మాత్రమే విడదల చేసి, ఇంతర వరకు కార్యచరణ ప్రకటించలేదన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Trending
- మండలనేని సుబ్బారావు పుట్టినరోజు
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు