Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన పోపూరి సుధాకర్ గారి కుమారుడు పోపూరి వెంకటేష్ గారికి ఇటీవల యాక్సిడెంట్ అవ్వడంతో, ఈరోజు వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

Read More

శ్రీ అభయాంజనేయ స్వామియే నమః భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ది 22 .5 .2025 అనగా గురువారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయము 8:30 నుండి పంచామృతాభిషేకములు జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును సాయంకాలము ఐదు గంటల నుండి కోలాట కార్యక్రమము జరుగును తదుపరి 7:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్తులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి…

Read More

నరసరావుపేట పట్టణంలోని ఆవులు సత్రం కొనిశెట్టి లక్ష్మయ్య బజారులో కారు బీభత్సం సృష్టించింది అతి వేగంగా ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని తర్వాత ఆటోను ఢీకొని ఇళ్లపైకి దూసుకు వచ్చిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఓ మైనర్ బాలుడు కారును అదుపు చేయలేక వేగంగా ఇళ్ళ మీదకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళన గురి చెందారు.

Read More

కోర్టు నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వండి-లాయర్లు చిలకలూరిపేట పట్టణంలో ని NRT సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను కలసి విన్నవించారు. ఈ విషియం పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యులు స్పందించి త్వరలో దీనిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Read More

చిలకలూరిపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ తల్లి పిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం,, సభకు అధ్యక్షత వహించిన నాయుడు శివ కుమార్. పాల్గొన్న అఖిలపక్ష నేతలు. కార్యక్రమం ఉద్దేశించి రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం సధ్వినియోగం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ సహకారం కోసం వారిని కలుస్తామని అన్నారు. ముఖ్యంగా 50 పడకల తల్లి పిల్లలు ఆసుపత్రికి అనుమతులు సాధించే దిశగా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదామన్నారు.తల్లి పిల్లల ఆసుపత్రి తో పాటుగా ట్రామా కేర్ యూనిట్,బ్లడ్ బ్యాంక్ సాధించే విషయంలో అఖిల పక్షం కృషి చేస్తుందన్నారు.

Read More

ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నాటిక పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం ప్రారంభించారు. ముందుగా నటరాజ, ఎన్టీఆర్ లకు పూజలు నిర్వహించారు. శివశక్తి లీలా పౌండేషన్ చైర్మన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన సతీమణి మక్కెన పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది ముప్పాళ్ళ కల్పన పాల్గొని జ్యోతిని వెలిగించి నాటికల పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు నాటిక, ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి కిడ్నాప్ నాటికలను శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నాటికగా జనరల్ బోగీలు నాటికలో జయలక్ష్మీ అనే వృద్దురాలు కుమారుడి రైలు ప్రమాదంలో గుర్తించడంలో పోలీసుల తీరును ఆమె ప్రశ్నించడం చూపరులను ఎంతగానో మంత్ర ముగ్దలని చేసింది ఆదేవింగా జనరల్ బోగీలో ప్రయానించే ప్రయానికులకు గుర్తింపు ఇవ్వలని, తన కోడుకులా మరోకరు ఇబ్బందులు పడకూడదని, ఇప్పటికైనా…

Read More

21న డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండిఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 21వ తేదీ బుధవారం జరిగే ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారుఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు బి,వెంకటేశ్వర్లు, పి ఆర్టియు నాయకులు షేక్ ఖాజావలితెలిపారు,ప్రాథమిక పాఠశాలల పిఎస్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాల లో పనిచేస్తున్న సెకండ్ గ్రేట్ టీచర్ కి…

Read More

తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 35వ వార్డులో నూతన కార్యవర్గం ఎన్నిక

Read More

సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియుజిల్లా అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు, శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు నియోజకవర్గ మహానాడు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా *నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు * పాల్గొంటారు.కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము కన్నా గారికార్యాలయంసత్తెనపల్లి

Read More

చిలకలూరిపేట నియోజకవర్గ – మహానాడు తెలుగు నేల పులకించేలా…పసుపు జెండా రెపరెపలాడేలా… మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి అధ్వర్యంలో (20.05.2025) మంగళవారం సాయత్రం 4:00 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు నియోజకవర్గ “మహానాడు” కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవి కుమార్ గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు పాల్గొననున్నారు. కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర,జిల్లా,పార్లమెంట్ మరియు నియోజకవర్గ, మండల,టౌన్, వార్డు,గ్రామ లలోని వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ

Read More