Author: chilakaluripetalocalnews@gmail.com

జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామం ఒక రాజకీయ చైతన్యానికి వేదికైంది. స్థానిక మండలనేని ఫంక్షన్ హాల్‌ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది.ముఖ్య అతిథుల సందేశం – పార్టీ బలోపేతంఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, విశిష్ట అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంచార్జ్ గాదె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్రియాశీలక సభ్యత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే జనసేన బలం అని వారు స్పష్టం చేశారు.మండలనేని చరణ్ తేజ చొరవ – కార్యకర్తల ఉత్సాహంఈ కార్యక్రమం…

Read More

మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఒక ఫిర్యాదు అందింది. గురువారం మాచర్ల బిజెపి పట్టణ ఆఫీస్ లో నిర్వహించిన జనతా వారధి ప్రోగ్రాం లో రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య ఈ ఫిర్యాదు ఇచ్చారు. పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వచ్చిన ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఫిర్యాదు దారుడికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్సీ మోర్చా ఇంచార్జ్ సజ్జన్ పాల్గొన్నారు.

Read More

పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారధి ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్నం కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశానుసారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినదిఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఇద్దరు దగ్గర అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీ వివరాలు ఒకటి ఇంటి నివేశ స్థలం కొరకు రెండవది రేషన్ కార్డు కొరకు అర్జీలు సేకరించి పిడుగురాళ్ల పట్టణ ఎమ్మార్వో గారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

Read More

దాచేపల్లి మండలం లో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాచేపల్లి మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పలువురికి సమస్యల్ని దాచేపల్లి మునిసిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు దాచేపల్లి మండల ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

Read More

శ్యావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,కేంద్ర రాష్ట్ర బిజెపి దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు pvn మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని మండలంలోని ఇర్లపాడు గ్రామంలో స్థానిక బిజెపి నేత వెనిగండ్ల ఆంజనేయులు గారి నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు ఆరు అర్జీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ రక్షిత మంచినీటి గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని దీనికి జల్ జీవన్ మిషన్ (jjm)పథకం మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో పూర్తిస్థాయిలో సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని,…

Read More

కన్నప్రేమ కన్నీటి వేదనకు.. MLA ‘పుల్లారావు’ అభయం ● కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి అండగా చిలకలూరిపేట ఎమ్మెల్యే● రూ. 30 లక్షల ఆపరేషన్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ● ‘ఆయన మాకు దైవంతో సమానం’ – కన్నీటి పర్యంతమైన తల్లి రమాదేవి చిలకలూరిపేట:కన్నకొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, కిడ్నీలు ఫెయిల్ అయ్యి మృత్యువుతో పోరాడుతున్నాడని ఆ తల్లి పడుతున్న ఆవేదన కలచివేసింది. సుమారు రూ. 30 లక్షల ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, “నా బిడ్డను కాపాడండి” అంటూ చేతులెత్తి మొక్కుతున్న రమాదేవి అనే తల్లి కన్నీటి గాథ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును కదిలించింది.. ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తుందిఆపరేషన్ నిమిత్తం అయ్యే రూ. 30 లక్షల ఖర్చుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందించారు. ముందుగా 15 లక్షల వరకు సాయం చేస్తామని హామీ ఇస్తూనే, మిగతా మొత్తాన్ని కూడా ప్రభుత్వం…

Read More

జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో ప్రసంగించిన గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… మర్రి రాజశేఖర్ గారు శాసన మండలిలో జిల్లా కోర్టుల వ్యవస్థపై ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేట లో జిల్లా కోర్టు పనిచేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్ కోర్టు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రమైన గుంటూరు లో కొనసాగుతోందని వివరించారు. ఈ కారణంగా పల్నాడు జిల్లాకు చెందిన న్యాయవాదులు మరియు ప్రజలు మొదట గుంటూరుకు వెళ్లి కేసులు ఫైల్ చేసి, అక్కడి నుంచి ఫైళ్లను నరసరావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు మరియు శ్రమ పరంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త…

Read More

మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి చొరవతో ‘స్పెషల్ గ్రేడ్’గా చిలకలూరిపేట మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి బాబు ప్రత్తిపాటి కృషితోనే సాధ్యం చిలకలూరిపేట మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లే కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని పట్టణ అభివృద్ధిపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంటూ మాజీ మంత్రి శాసనసభ్యులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరగనున్న ఉద్యోగ అవకాశాలు మెరుగైన సేవలు మున్సిపాలిటీ హోదా పెరగడం వల్ల పట్టణానికి చేకూరే ప్రయోజనాలను కమిషనర్ తెలిపారు స్పెషల్ గ్రేడ్ హోదాతో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులుమంజూరవుతాయి.మున్సిపాలిటీలో సిబ్బంది సంఖ్య పెరగనుంది, తద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం…

Read More

‘తెల్లదొరలూ… వెంకన్న సేవకులే..….రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులే. ఆ మాటకొస్తే ఆలయ పాలనా పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయి. దేవస్థానం రికార్డులే అందుకు ఆధారం. 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు.1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు… 1.దిట్టం:– శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ…

Read More

విజిలెన్స్ దాడుల్లో భారీగా నకిలీ సిగరెట్లు ల పట్టివేత గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి ఆలయం వెనుక బజార్‌లోని 15వ వార్డుకు చెందిన నోముల కోటేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది.ఈ తనిఖీలో, నోముల కోటేశ్వరరావు తన ఇంట్లో బిల్లులు లేకుండా అనధికారిక మరియు నాసిరకం సిగరెట్లను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ సిగరెట్లు నాసిరకం నాణ్యత కలిగి ఉంటాయి మరియు ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి మరియు సిగరెట్లకు చిత్రపరమైన ఆరోగ్య హెచ్చరిక లేదు, ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేవు మరియు ఇది COPTA చట్టాన్ని ఉల్లంఘించింది. ప్రశ్నించినప్పుడు, నోముల కోటేశ్వరరావు సత్తెనపల్లి పట్టణంలో నివసించే ఉయ్యూరు సుబ్బారావు గుప్తా @ ఉయ్యూరు సుబ్బారావు గుప్తా నుండి…

Read More