Author: chilakaluripetalocalnews@gmail.com

తల్లికి వందనంపై వైకాపా విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ తల్లికివందనంపై వైకాపా విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,091 కోట్లు జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్న జీవీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకంపై వైకాపా, జగన్ విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విపక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80% అమలు చేసి, ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నా రు. మరీ ముఖ్యంగా సూపర్‌సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు గౌరవం, విద్యావ్యవస్థకు బలం, సామాజిక సంక్షేమానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. నిజానికి తల్లికి…

Read More

పేటలో కంపోస్టు యార్డును పరిశీలించిన అధికారుల బృందం చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలోని కంపోస్టు యార్డును శనివారం నాడు ఎస్. ఈ.దాసరి శ్రీనివాసరావు.ఆర్.డి. ఎస్ హరికృష్ణ,ఈ.ఈ వెంకటేశ్వర్లు. పబ్లిక్ హెల్త్ రవికుమార్. ఎండి. శ్రీనివాసరావు. (ప్రాంతీయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు) మరియు మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు లు పరిశీలించారు.ఈ పరిశీలనలో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనుల పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపోస్టు యార్డు మెరుగుదలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. పారిశుద్ధ్య నిర్వహణలో కంపోస్టు యార్డు కీలక పాత్ర పోషిస్తున్నందున, దాని పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

బొప్పుడి కొండ పైన వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పూజలు చేసి స్వామి వారి ఆశీసులు పొందిన భక్తులు వివిధ రకాల పూలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ని అలంకరించిన అర్చకులు పవన్ శ్రావణ నక్షత్రం సందర్భంగా బొప్పూడి కల్యాణ వెంక టేశ్వర స్వామివారికి ప్రత్యేకఅభిషేకాలు నిర్వహించారు

Read More

తల్లికి వందనం పథకాన్ని సమర్దవంతంగా అమలు పరచిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి నేతలకు పాలాభిషేకం చేసిన 9 వ వార్డు పార్టీ నేతలుసూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్క హామీని నిలబెట్టుకునే దిశగా పరుగులు తీస్తున్న కూటమి ప్రభుత్వం,ఇటివల అమలు పరచిన తల్లికి వందనం కార్యక్రమం ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిందని, దానిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా 9 వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్ వద్ద ఉన్న NTR విగ్రహం వద్ద కూటమి పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు NTR విగ్రహానికి పూలమాలలు…

Read More

ప్రజా సమస్యలపై కాలనీ వాసులు ప్రత్తిపాటికి వినతి. చిలకలూరిపేట పట్టణ ములోని 38వ వార్డు జిడ్డు కాలనీ (గంగమ్మ సుగాలి కాలనీ) లో నెలకొన్న సమస్యల పై మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కు శనివారం వార్డు నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్నా వర్షాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నుంచి నీరు రోడ్లమీదకు ప్రవహిస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు. రానున్న కాలంలో కాలని ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మురుగు కాలువల్లో నీరు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కల్వర్టులు, సీసీ రోడ్లు వేయాలని ప్రత్తిపాటి ని కోరారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేయిస్తామన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయే విధంగా చూడాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి, గిరిజన సంఘం నాయకులు…

Read More

సీఎం.ఆర్.ఎఫ్ సాయం… వ్యాధిగ్రస్తులకు వరం : ప్రత్తిపాటి వివిధ రకాల దీర్ఘకాల వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల్ని సీఎం.ఆర్.ఎఫ్ సాయం వరంలా ఆదుకుంటోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబసభ్యులకు శనివారం ప్రత్తిపాటి తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని అందచేశారు. 32 మందికి రూ.27.76లక్షల చెక్కులు, అత్యవసర వైద్యసేవల నిమిత్తం ఒకరికి 1.75లక్షల విలువైన ఎల్.ఓ.సీని ప్రత్తిపాటి స్వయంగా బాధితులకు అందించారు. చెక్కులు, ఎల్.వో.సీలు అందించిన అనంతరం ఆయన వారితో మాట్లాడి కుటుంబస్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వం బటన్ నొక్కుడు ముసుగులో పేదల జీవితాల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు. ఒకచేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో వివిధ మార్గాల్లో 10 రూపాయలు లాక్కుందన్నారు. చెత్తపన్ను..ఇంటిపన్ను.కొళాయిపన్ను అంటూ ఇష్టానుసారం పన్నులేసి, నిత్యావసరాల ధరల పెంపు, కల్తీమద్యం అమ్మకాలతో పేద,…

Read More

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి ఆశీస్సులతో చిలకలూరిపేట పట్టణం,చిలకలూరిపేట రూరల్,యడ్లపాడు,నాదెండ్ల మండల అధ్యక్షులను నియమించడమైనది.. చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు గా షేక్ దరియావలి.. చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు.. నాదెండ్ల మండల అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు… యడ్లపాడు మండల అధ్యక్షుడుగా వడ్డేపల్లి నరసింహ రావు లను నియమించడమైనది.. ఇట్లువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీచిలకలూరిపేట నియోజకవర్గం

Read More

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (apjf ) ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు దండా గోపి గారి తల్లి గారైనా శ్రీమతి దండా సుమతి దేవి గారు మృతి చెందడం జరిగింది, మిట్టపాలెం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫ్ఫాని, జవ్వాజి మదన్, కందుల రమణ, మద్దుమాల రవి, గంగా శ్రీనివాసరావు, తుబాటి శ్రీహరి, మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…

Read More

ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అంద‌జేత దివ్యాగులకు చేయూత నిస్తున్నా ఇన్నర్ వీల్ క్లబ్ మహిళ ల ఆర్థిక సహాయం తో సేవా కార్యక్రమాలు స్నేహం, సేవా అనే దృక్పథంతో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ పని చేస్తుందని క్ల‌బ్ అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజిని అన్నారు. ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆఫ్ చిల‌క‌లూరిపేట ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని సుగాలీ కాల‌నీలో నివాసం ఉండే కోట‌మ్మ‌బాయి అనే దివ్యాంగురాలికి శుక్ర‌వారం ట్రైసైకిల్ అంద‌జేశారు. స్థానిక స్వాతి జ్యువలర్స్ అధినేత కొత్తూరి సూర్య నారాయణ అందించిన ఆర్దిక స‌హాకారంతో ఈ సేవా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు గ‌ట్టు స‌రోజిని తెలిపారు. గ‌తం నుంచి క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి సేవ‌కు ప్ర‌తిరూపంగా నిలిచింద‌ని పేర్కొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ చేప‌ట్టే సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించారు. క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ప‌లువురు దివ్యాంగుల‌కు ట్రైసైకిళ్లు అంద‌జేసిన‌ట్లు గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో క్ల‌బ్…

Read More

చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాధాకృష్ణ జ్యువెలరీ మార్ట్ అధినేత కొల్లా శ్రీరామమూర్తి గారు అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది . ఈరోజు వాసవినగర్ లోని వారి స్వగృహం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, బండారుపల్లి సత్యం గారు, కందుల రమణ గారు, బేరింగ్ మౌలాలి గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, గంగా శ్రీనివాసరావు గారు, మురకొండ మల్లిబాబు గారు, కొత్త కోటేశ్వరరావు గారు, రాచుమల్లు సూర్యారావు గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More