భారత15వ నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి పి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన
చిలకలూరిపేట బిజెపి నాయకులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎన్ ఆర్ టి సెంటర్లో వాజ్పేయి విగ్రహం దగ్గర. అంగరంగ వైభవంగా పండగ వాతావరణం కొనసాగేలాగా భారత 15వ నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి పి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు , ఈ పండగ వాతావరణంలో అందరికీ స్వీట్లు పంచుతూ చాలా సంతోషంగా హర్షద్వనాలతో సంతోషం తో పొంగిపోయిన బిజెపి నాయకులు
చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ “ఉప రాష్ట్రపతి” గా ఎన్నికవడం దేశ ప్రజాస్వామ్యానికి ఒక పండుగ. సమాజ వాణి, హక్కులు, గౌరవం ప్రతిధ్వనించేలా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది అని రాధాకృష్ణన్ ఎన్నిక ద్వారా అర్ధం అవుతుంది. ఇది వికసిత భారత్ వైపుకి కొన్ని అడుగులను జోడిస్తుంది.
ఈ ఎన్నిక బిజెపి కి సామాజిక న్యాయం పట్ల ఉన్న అంకితభావం.ను ప్రతిబింబిస్తుంది. భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డాకి ఎన్డీయే లో పార్టీలకు నాయకులకు ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, చిలకలూరిపేట కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు స్టేట్ యువజన మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రూ పూర్ణచంద్రరావు, స్టేట్ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ తూబాటి రాజ్యలక్ష్మి, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, మాజీ సెక్రెటరీ,జి బాలకృష్ణ ఆఫీస్ సెక్రటరీ, షేక్ మహబూబ్ సుభాని మైనార్టీ నాయకులు,బిజెపి నాయకులు పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, బిజెపి ఉప్పాల భాస్కరరావు,పల్లపు శివయ్య,మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ,బీజేపీ నాయకులు కోమటి వాసు, బిజెపి నాయకులు జె రాయుడు, తదితరులు పాల్గొన్నారు



