వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి

  • జీవోలు కాల్చినంత మాత్రాన.. పేదలకందే నాణ్యమైన వైద్యసేవల కార్యాచరణ నిలిచిపోదు.
  • పీపీపీ విధానాన్ని దిల్లీలో ఆమోదించి..రాష్ట్రంలో వ్యతిరేకించడం వైసీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.

అమరావతి న్యూస్ చిలకలూరిపేట

జగన్ మెప్పుకోసం వెంపర్లాడే క్రమంలో వైసీపీనేతలు రోజురోజుకీ విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారు. ప్రజామోదం పొందిన పాలకుల నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నారు. పీపీపీ విధానంపై కోటిసంతకాల సేకరణ పేరిట ప్రజల్లో అభాసుపాలైనా వారిలో మార్పురాలేదు. భోగి మంటల్లో వైసీపీనేతలు దహనం చేసింది పీపీపీ జీవోలుకాదు.. ఏళ్లనుంచి వారిలో గూడుకట్టుకు పోయిన అసత్యాలు.. అబద్ధాలను. వైసీపీ నేతలు దహనం చేయాల్సింది పీపీపీ జీవోలు కాదు… తమలోని విద్వేష లక్షణాల్ని..వినాశకర ఆలోచనల్ని. ప్రజలు మెచ్చే పాలకుల నిర్ణయాలపై అసంతృప్తి.. తిరుగుబాటు, వైసీపీ సిద్ధాంతమా లేక జగన్ స్వార్థ రాజకీయమో ఆ పార్టీనేతలే చెప్పాలి. పీపీపీ మోడల్ సాధ్యాసాధ్యాలు, తద్వారా కలిగే ప్రయోజనాలపై కేంద్రం నియమించిన కమిటీసభ్యులుగా ఢిల్లీలో విధానాన్ని సమర్థించడం.. రాష్ట్రంలో వ్యతిరేకించడం వైసీపీ రెండు నాల్కల ధోరణి కాదా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రాద్ధాంతం…. ముమ్మాటికీ వైసీపీ విషప్రచారమే.
జీవోలు కాల్చినంత మాత్రాన.. నాణ్యమైన వైద్యసేవల కార్యాచరణ నిలిచిపోదు.
పీపీపీ జీవో ప్రతుల్ని కాల్చినంత మాత్రాన పేదలకు నాణ్యమైన వైద్యసేవల కార్యాచరణ నిర్ణయం నిలిచిపోదు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య నమూనాతో కూడిన అభివృద్ధిని వ్యతిరేకించడమంటే… పేదల ఆరోగ్యంతో చెలగాటమాడటం.. రాష్ట్ర వైద్యరంగ ప్రగతికి తూట్లు పొడవడమే అవుతుంది. అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడే అంతుచిక్కని వ్యాధి నుంచి బయటపడనంతకాలం వైసీపీనేతలు ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, ప్రజల్లోచులకన అవుతూనే ఉంటారు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు.

Share.
Leave A Reply