ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ పోస్టర్ను ఆవిష్కరించిన బిజెపి నాయకులు
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీ తయారీ ప్రోత్సహించటం మనం తయారు చేసిన ఉత్పత్తులనే వినియోగించడం దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభింస్తోంది. ఈ ఉద్యమం పండుగ సీజన్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు విస్తృత మద్దతును అందించింది. ఈ క్రమంలో దీపావళీ పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ పిలుపు మేరకు తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని రాష్ట్ర ప్రజలు నమో యాప్ లో నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టౌన్ అధ్యక్షులు కోట వెంకట పవన్ కుమార్ గాంధీ, చిలకలూరిపేట ఇంచార్జ్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్, కన్వీనర్ సింగిరేసు పోలయ్య, కో కన్వీనర్ రావికింది రామకృష్ణ, నాదెండ్ల మండల ఇంచార్జ్ మల్లెల శివ నాగేశ్వరరావు,కొ కన్వీనర్ వరికూటి నాగేశ్వరరావు, కో కన్వీనర్ సుభాని, ఎడ్లపాడు ఇన్చార్జి బండారు నాగరాజు, చిలకలూరిపేట రూరల్ కన్వీనర్ ఉప్పాల భాస్కరరావు, రాయుడు, వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ కార్యదర్శి హనుమాన్ సింగ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.



