ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ సూచనలు మేరకు ఈరోజు ఎన్నార్టీ సెంటర్ లో గల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శివాలయం దేవస్థానం నందు ఈరోజు ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గోత్రనామాలతో రుద్రాభిషేకం చేసి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై 1025 జనవరిలో గజనీ మహమ్మద్ దాడి చేసి 2026 నాటికి వెయ్యేళ్లు కాగా.. 1951లో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు (అమృతోత్సవం) పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి11న సోమనాథ్ క్షేత్రంలో సహస్ర సంకల్పయాత్ర ను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జి మహేష్, పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీపట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు. ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఎడ్లపాడు కార్యదర్శి దాట్ల రాజు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ వంకాయలపాటి,పట్టణ మీడియా ఇన్చార్జి రావికింది రామకృష్ణ, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు పఠాన్ యాసిన్ చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు హనుమాన్ సింగ్ పట్టణ యువజన అధ్యక్షులు తెల్లపాటి మనోహర్ పట్టణ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట పట్టణ మైనార్టీ వచ్చే అధ్యక్షులు సుభాని షేక్ పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీను మండల మహిళా అధ్యక్షురాలు మక్కా దుర్గా ఎడ్లపాడు మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు ఎడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షులు మల్లాకోటి బిజెపి నాయకులు బుజ్జి బాబు కోమటి వాసు తదితరులు పాల్గొన్నారు.



