సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ

సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా స్థానిక శివాలయం లొ సోమనాద్ స్వభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై 1025 జనవరిలో గజనీ మహమ్మద్ దాడి చేసి 2026 నాటికి వెయ్యేళ్లు కాగా.. 1951లో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు (అమృతోత్సవం) పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జనవరి11న సోమనాథ్ క్షేత్రంలో సహస్ర సంకల్పయాత్ర ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కర్పూర జ్యోతి వెలిగించటం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పట్టణ అధ్యక్షులు ఇంటూరి రామ్మూర్తి. విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షురాలు విప్పల కృష్ణవేణి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నరు.

Share.
Leave A Reply