బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో ముప్పల హనుమంతరావు హాస్పటల్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 163 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రేరణ ప్రధానంగా ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, ఆత్మశక్తిని గుర్తించడం, మరియు నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుంది; ఆయన యువతను తమలోని దివ్యత్వాన్ని గుర్తించి, లక్ష్యం కోసం నిరంతరం శ్రమించమని, సమాజానికి సేవ చేయమని, మతాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించాలని బోధించారు, ఆయన జీవితం, బోధనలు భారతదేశ యువతకు మరియు ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. లేవండి మేల్కొనండి లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకండి ఇది ఆయన ప్రసిద్ధి నినాదం అని తెలిపారు, ప్రతి ఒక్కరూ తమలో అపారమైన శక్తిని కలిగి ఉన్నారని, దానిని గ్రహించడమే నిజమైన విజయమని ఆయన బోధించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, స్టేట్ బీజేవైఎం అధ్యక్షుడు పులిగుజ్జి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పట్టణ మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్లో అధ్యక్షులు షేక్ సుభాని, పట్టణ బిజెపి నాయకులు మనోహర్, బిజెపి నాయకులు కోమటి వాసు తదితరులు పాల్గొన్నారు



