నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి నాయకులు

నాదెండ్ల మండలం, గణపవరం గ్రామంలో మండలనేని వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట బిజెపి నాయకులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ నాయకులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానం చేసి అయ్యప్ప స్వామి షిల్డ్ ఇచ్చి గౌరవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, బిజెపి నాయకులు కమిటీ శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply