బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం విశ్వకర్మ జయంతి కార్యక్రమం సేవా పక్వాడ్ లో భాగంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఎన్ ఆర్ టి సెంటర్ మెడికల్ హాల్ లో నిర్వహించడం జరిగింది . విశ్వకర్మ జయంతి, ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తేదీన జరుపుకునే దైవిక శిల్పి విశ్వకర్మ జన్మదినం. అసలు ఎవరు ఈ విశ్వకర్మ? విశ్వకర్మ దేవతల దైవిక వాస్తుశిల్పి మరియు సృష్టికర్త. హిందూ పురాణాల ప్రకారం, విశ్వకర్మ స్వయంభువుగా మరియు ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడతారు. ఈ పండుగ సందర్భంగా చేతివృత్తులవారు, ఇంజనీర్లు మరియు పారిశ్రామిక నిపుణులు తమ పనులలో పురోగతి మరియు శ్రేయస్సు కోసం విశ్వకర్మను పూజిస్తారు.విశ్వ కర్మ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడిగా హిందూ గ్రంధాలు పేర్కొన్నాయి.
ప్రపంచ సృష్టిలో మరియు వివిధ వస్తువుల నిర్మాణంలో ఆయన పాత్రకు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు.విశ్వకర్మ విగ్రహాలకు లేదా చిత్రపటాలకు పూజలు చేస్తారు.
పనిముట్లు, యంత్రాలు మరియు వృత్తికి సంబంధించిన ఇతర పరికరాలను శుభ్రపరచి, వాటిని పూజిస్తారు.
పనిలో పురోగతి మరియు విజయం కోసం విశ్వకర్మ ఆశీస్సులు కోరుకుంటారు.
ఈ విశ్వకర్మ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా ఇంచార్జ్ తుర్లపాటి వెంకట నగేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ వివిధ పథకాలకు విశ్వకర్మ పేరు పెట్టడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు ఈ శ్రమ కార్డు ద్వారా కార్పెంటర్స్ కు కూడా అసలైన పురోగతి వచ్చిందీ ఈ విధంగా విశ్వకర్మ చేతి వృత్తుల వారికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ నాయకులు కార్పెంటర్స్ వారి సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. వారి అసోసియేషన్ బిల్డింగ్ స్థలా సేకరణకు సహకరించాలని బిజెపి నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు కోట వెంకట పవన్ కుమార్ గాంధీ, ప్రోగ్రాం కన్వీనర్ సింగిరేసు పోలయ్య, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, పోగ్రామ్ కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు, రూరల్ మండల కన్వీనర్ ఉప్పల భాస్కరరావు, బిజెపి నాయకులు బండారు నాగరాజు, రావికింది రామకృష్ణ, షేక్ మహబూబ్ సుభాని, బాలకృష్ణ, బీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ్ దుర్గారావు, వెంకట హనుమంతరావు, గుమ్మ బాలకృష్ణ, ప్రోగ్రాం నాదెండ్ల మండల కన్వీనర్ వరికుటి నాగేశ్వరరావు, యువజన మోర్చా పులి గుజ్జు మహేష్, బీజేవైఎం నాయకులు మందాడి ఫణి, కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు కాళహస్తి వెంకటేశ్వర్లు, సలహాదారులు ఖాదర్ బాబు వైస్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి బాబు కార్పెంటర్ నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు కార్పెంటర్స్ పాల్గొనడం జరిగింది.



