Author: chilakaluripetalocalnews@gmail.com

నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ నెల 5 న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు శంకు ప్రతిష్ట మహోత్సవం జరుగు చున్నది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని కోరిన గణపవరం అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప భక్తులు… ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు మండలనేని వెంకటేశ్వర్లు, గురుస్వామి తులం పూర్ణచంద్రరావు , మాదినేని చంద్రమౌళి , కెల్లంపల్లి రెడ్డియ్య మాస్టర్ , సిద్దు హనుమంతరావు , అధికారి వెంకటేష్ , చక్రవరం శివరాజు తదితరులున్నారు.

Read More

సిద్ధి గణపతి, అభయాంజనేయస్వామి వార్ల గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి శ్రీ సిద్ధిగణపతి, శ్రీ అభయాంజనేయస్వామి, సీతలాంబ తల్లి బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా తలపెట్టిన గ్రామోత్సవాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంగళవారం యడ్లపాడు మండలం జగ్గాపురంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి ప్రజలతో కలిసి స్వామివార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన హోమంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతం ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులు, కార్యక్రమాల నిర్వాహకులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, స్వామివార్ల అనుగ్రహాం లభించేలా శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ప్రతిష్టామహోత్సవం నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, ముద్దన నాగేశ్వరరావు, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, శంకర్రావు, గట్టినేని విజయ్ సాయి, పోపూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ముద్దన పార్థసారథి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా… నరసరావుపేట నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు 2029లో కూడా నరసరావుపేట కి నేనే ఎమ్మెల్యేని మా నాయకుడు చంద్రబాబే సీఎం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎవరినైనా ప్రశాంతంగా వుండనిచ్చారా ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదు అమరావతికి పోలవరానికి మూడు రాజధానుల పేరిట తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా ఆలోచించుకోండి మీ హయాంలో మాచెర్లలో ఎన్ని హత్యలు జరిగాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గోపిరెడ్డి రియల్ ఎస్టేట్ మున్సిపాలిటీలో నువ్వు చేసిన అవినీతి ప్రజలు మరిచి పోలేదు ఇండ్ల మీద పడి చేసిన దాడులను ప్రజలు గుర్తుపెట్టుకొనే ఉన్నారు ఇప్పటి కైనా మీలో మార్పురాకపోతే 11…

Read More

తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట– మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి యడ్లపాడు మండలంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొండవీడుకోటను మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి మంగళవారం సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు, మహాద్వారం, పిల్లల క్రీడాపార్కు, తూర్పు ద్వారము (కట్టిలదిద్ది వాకిలి), లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేమన మండపం, అనవేమారెడ్డి విగ్రహం, చారిత్రక అంశాలను వివరించే గ్యాలరీ, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల చెరువు డెక్కు ప్రాంతాలతో పాటు కొండపై ఉన్న చారిత్రక ప్రదేశాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కత్తులబావి సందర్శనకు వెళ్లగా కోటగ్రామస్తులు సాదరస్వాగతం పలికారు. కొండవీటి కైఫియత్తు ఆధారంగా 72 మంది పాలెగాండ్ల తిరుగుబాటును అణచివేసేందుకు బావిలో కత్తులు అమర్చి జరిగిన ఘోర ఘటనను కల్లి శివారెడ్డి వివరించారు. అక్కడ నుంచి హౌస్‌గణేష్‌పాడులోని అఖిలభారత రెడ్లసంక్షేమ సమాఖ్య ఏర్పాటు చేసిన కొండవీటి రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడ ఇటీవల లభ్యమైన…

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, అవిశాయపాలెం గ్రామంలో జరుగుచున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు గారి అత్తయ్య పునాటి స్వరాజ్యమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, మద్దూరి వీరా రెడ్డి గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జోనల్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తలకు ఏ విధంగా పనిచేయాలో పలు సూచనలు అందించారు. పలు అంశాలను చర్చించి బిజెపిపార్టీని లోపేతం చేయటానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుచున్న విధానాల గురించి చర్చించి కార్యకర్తలను అభిప్రాయాలను తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు కేతనబోయిన హనుమంతరావు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచందర్రావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రంజిత్, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ, ఎడ్లపాడు…

Read More

జ‌గ‌న్ చేయాల్సింది ప‌శ్చాత్తాప‌, ప్రాయశ్చిత్త‌, సంతాప దినాలు : మాజీమంత్రి ప్రత్తిపాటి

Read More

రేపు వైస్సార్సీపీ నిరసన ర్యాలీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని పిలుపు వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడి మాజీమంత్రి విడదల రజిని పిలుపు చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్‌ 4వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్‌ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులకు,మండల అధ్యక్షులకు మరియు పట్టణ నాయకులకు గ్రామ అధ్యక్షులకు,కార్యకర్తలకు నమస్కారం జనసేన పార్టీ అధిష్టానం… డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది – పీడా విరగడై ఏడాది అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి – దీపావళి పండుగలను కలిపి చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఉదయం పూట ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించి మరియు సాయంత్రం పూట దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చవలసిందిగా పార్టీ అధిష్టానం ఈ ఉదయం వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులందరితో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

Read More

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 63 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామస్తుడు అయిన పారుపల్లి నరసింహ రావు అను అతను అదే గ్రామానికి చెందినటువంటి చదలవాడ హరికృష్ణ మరియు చదలవాడ రమణ ఇద్దరు అన్నదమ్ములకు పొలం చేసుకొనుట కొరకు కౌలుకు ఇప్పించినట్లు, మరియు 7,24,000/-రూపాయలు ఇప్పించినట్లు, పైన…

Read More