జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే ఈ రోజు పల్నాడు పర్యటన : ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు
పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి బలప్రదర్శన చేశారు.
ఇద్దరు అమాయకుల మరణం జగన్, వైకాపా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
జగన్ ఒకరిని పరామర్శించడానికి వచ్చి మరో ఇద్దరి మరణానికి కారణమయ్యాడు.
జగన్ కారణంగా నష్టపోయిన వ్యక్తి మరణాన్ని తెదేపాకు ఆపాదించాలని చూడడమే దారుణం.
జరిగిన విషాదంపై జగన్, వైకాపా స్పందించకుండా పర్యటన కొనసాగించడం మరో దుర్మార్గం.
పల్నాడు జిల్లాలో చిచ్చురేపడం కోసమే వైకాపా, జగన్ రెచ్చగొట్టే రాజకీయాలు.
వైకాపా ఐదేళ్ల పాలనలో రాజకీయహింసను ప్రోత్సహించారు.. మళ్లీ అదే చేస్తున్నారు.
ఇద్దరి మృతికి కారణమైన ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.