జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడం
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ గారు రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ ఆదేశాల మేరకు తేది 18-06-2025 బుధవారం నాడు పోలీసు, రవాణా శాఖ మరియు R.T.C. అధికారులు చిలకలూరిపేట నుండి నరసరావుపేట వెళ్ళు రహదారిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా ఇన్సూరెన్సు సర్టిఫికెట్ , పొల్యూషన్ సర్టిఫికెట్ పన్ను చెల్లించని, మరియు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనములు నడుపుచున్న వారి పై కేసులు నమోదు చేయడం జరిగినది. ఇందులో భాగంగా సుమారు 45 వాహనములు తనిఖీచేసి 13 వాహనములకు కేసులు నమోదు చేసినాము. ఇందులో ఇన్సూరెన్సు సర్టిఫికెట్ లేనివి 7, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివి 6, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనివి 5, పర్మిట్ లేనివి ఒకటి Driving Licence లేనివి 9, వున్నాయి. అందులో 3 వాహనముల ను స్వాధీనము చేసుకుని భద్రత నిమిత్తము RTC స్థానిక డిపో నందు ఉంచాము. అపరాధ రుసుము రూపంగా 90820/- రూపాయలు వసూలు చేసినాము.
ఈ తనిఖీలలో చిలకలూరిపేట ఆర్టీసీ డి ఎం రాంబాబు గారు, పోలీస్ శాఖ వారు తరఫునుంచి సీ.ఐ మరియు ఎస్.ఐ, TRAFFIC పోలీసులు రవాణా శాఖ వారి తరఫునుంచి సహాయ తనిఖీ అధికారి K.L.RAO పాల్గొన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని దీనివల్ల రోడ్లపై జరిగే ప్రమాదాలను నిర్మూలించవచ్చని తెలియపరచడమైనది.
ఇట్లు,
జి సంజీవ్ కుమార్
పల్నాడు జిల్లా రవాణాశాఖ అధికారి
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



